President Droupadi Murmu : 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవాలు
రాష్ట్రపతి(President Droupadi Murmu) భద్రతా ఏర్పాట్లపైనా చర్చ జరిగింది.
- By Pasha Published Date - 12:58 PM, Sat - 21 September 24

President Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సెక్రటేరియట్‌లో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఇవాళ జరిగింది. రాష్ట్రపతి(President Droupadi Murmu) భద్రతా ఏర్పాట్లు, పర్యటనకు సంబంధించిన అంశాలపైనా చర్చ జరిగింది.
Also Read :AP Student Suicide : పాట్నా ఎన్‌ఐటీలో ఏపీ విద్యార్థిని సూసైడ్.. సూసైడ్ నోట్ లభ్యం
ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలు జరగనున్నాయి. వీటిని స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈవిషయాన్ని రాష్ట్రపతి నిలయం కార్య నిర్వహణ అధికారి రజనీ ప్రియ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను అందరికీ తెలియజేయడానికే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 28వ తేదీన ఉదయం నుంచే రాష్ట్రపతి నిలయంలో ప్రజల సందర్శనార్థం పలు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సాయంత్రం కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని భావించే వారు రాష్ట్రపతి నిలయం ఎంట్రీ గేటు వద్దనున్న కౌంటర్‌లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://rashtrapatibhavan.gov.in వెబ్ సైట్‌ను చూడొచ్చు.
Also Read :Indian Official Dead : అమెరికాలోని భారత ఎంబసీలో అధికారి అనుమానాస్పద మృతి
లాలూ విచారణకు రాష్ట్రపతి అనుమతి
ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగార్థుల నుంచి భూములు లంచంగా తీసుకొని.. వారికి రైల్వే ఉద్యోగాలను అమ్ముకున్నారనే అభియోగాలతో నమోదైన కేసులో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను విచారించేందుకు అనుమతులు మంజూరు చేశారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో లాలూ రైల్వే మంత్రిగా వ్యవహరించారు. ఆ టైంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. బిహార్‌లో భూములు తీసుకొని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్ జోన్‌లో ఉద్యోగార్థులకు గ్రూపు-డి ఉద్యోగాలు ఇచ్చారని సీబీఐ అంటోంది.