AP Student Suicide : పాట్నా ఎన్‌ఐటీలో ఏపీ విద్యార్థిని సూసైడ్.. సూసైడ్ నోట్ లభ్యం
విద్యార్థిని ఉండే హాస్టల్ రూంలో సూసైడ్ నోట్(AP Student Suicide) దొరికిందని పోలీసులు వెల్లడించారు.
- By Pasha Published Date - 11:51 AM, Sat - 21 September 24

AP Student Suicide : బిహార్‌లోని పాట్నాలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్ పాట్నా)లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆమె ఉరివేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఉరి వేసుకున్న విషయాన్ని శుక్రవారం రాత్రి 10.35 గంటలకు తోటి విద్యార్థులు గమనించారు. అనంతరం వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఈవిషయాన్ని తెలియజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ సేకరించారు. విద్యార్థినితో పాటు ఆ రూంలో ఉండే తోటి విద్యార్థినులను ప్రశ్నించారు.
Also Read :Indian Official Dead : అమెరికాలోని భారత ఎంబసీలో అధికారి అనుమానాస్పద మృతి
సూసైడ్ చేసుకోవడానికి ముందు విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థిని కుటుంబ సభ్యులకు దీనిపై సమాచారాన్ని చేరవేశారు. విద్యార్థిని ఉండే హాస్టల్ రూంలో సూసైడ్ నోట్(AP Student Suicide) దొరికిందని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. దర్యాప్తు పూర్తయితేనే ఆవిషయంపై క్లారిటీ వస్తుంది. ఈ ఘటన నేపథ్యంంలో నిట్ పాట్నా వద్ద విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. కాలేజీ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.