Revanth Reddy: అసదుద్దీన్ షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్: రేవంత్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసదుద్దీన్ షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్ ధరించాడు అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో ఒవైసీ బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు.
- By Praveen Aluthuru Published Date - 02:06 PM, Mon - 13 November 23

Revanth Reddy: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసదుద్దీన్ షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్ ధరించాడు అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో ఒవైసీ బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేయకపోవడంపై రేవంత్ విమర్శలు ఎక్కు పెట్టారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ఎంఐఎం పోరాడే సాహసం చేయదని విమర్శించారు .హైదరాబాద్‌లోని ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ ఎప్పుడూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ షేర్వానీ కింద పైజామా ఉందని అనుకున్నా, అది ఖాకీ నిక్కర్ అని తేలిందని రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ముస్లిం హక్కుల కోసం పోరాడేందుకు అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ తనకు బారిస్టర్‌గా శిక్షణ ఇచ్చారని పేర్కొన్న రేవంత్.. ముస్లింలను ఇబ్బందులకు గురిచేసిన బీజేపీకి అసదుద్దీన్ మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. రాజా సింగ్‌పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడేందుకు. ఒవైసీ అబద్ధాలు చెబుతున్నాడు.
Also Read: Telangana Elections 2023 : ఖమ్మంలో భారీగా నగదు, మద్యం, బాణసంచా స్వాధీనం