HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth In Delhi For The Second Day Cms Request To Union Minister

Delhi Tour : రెండో రోజు ఢిల్లీలో రేవంత్..కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్ట్

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

  • Author : Latha Suma Date : 04-03-2025 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth in Delhi for the second day.. CM's request to Union Minister
Revanth in Delhi for the second day.. CM's request to Union Minister

Delhi Tour : ఢిల్లీలో ముఖమంత్రి రేవంత్‌ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మంగళవారం ఉదయం కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారు. అరగంట పాటు సాగిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేక‌ర‌ణ‌, స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Read Also: Telangana MLC Results : బీజేపీ గెలుపు, బీఆర్ఎస్‌కు సంక్షోభం

2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇక, సాయంత్రం సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌‌తోనూ భేటీ కానున్నారు.పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్-2,రీజినల్ రింగ్ రోడ్డు, ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఆ తర్వాత రేవంత్ ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, తెలంగాణలో ఎక్కడా కూడా గత పదేళ్లుగా రేషన్ కార్డు అమలుకాలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు రేషన్ కార్డులను ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ముమ్మరం చేశారు. రేషన్ కార్డుల కోటా కింద రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ధాన్యం, సబ్సీడీని కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న నిధులతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులపై కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. దేశంలో ధాన్యం సేకరణలో పంజాబ్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో తెలంగాణ ఉంది.

Read Also: Telangana MLC Results : బీజేపీ గెలుపు, బీఆర్ఎస్‌కు సంక్షోభం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Congress Govt
  • delhi tour
  • Minister Pralhad Joshi
  • Minister Uttam Kumar Reddy
  • New Ration Cards

Related News

New Ration Cards

రేషన్ కార్డులు లేని వారికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది ఏదో ఒక సమయానికి పరిమితం కాదని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంటుందనే ప్రచారానికి స్వస్తి పలుకుతూ, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించడం పట్ల పేద వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd