Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని బులెటిన్‌లో పేర్కొన్నారను. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు. కళ్లు తెరుస్తున్నాడని కిమ్స్ వైద్యులు తెలిపారు.
- By Gopichand Published Date - 11:40 PM, Fri - 20 December 24

Pushpa 2 Stampede: తెలంగాణలో డిసెంబర్ 4న తొక్కిసలాట ఘటనను ఎవరూ మర్చిపోలేరు. ఆరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షోకి (Pushpa 2 Stampede) వచ్చి ఓ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరచంగా మారింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అభిమాని మృతిచెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆరోజు నుంచి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా కిమ్స్ వైద్యులు విడుదల చేసిన బులిటెన్‌లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని బులెటిన్‌లో పేర్కొన్నారను. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు. కళ్లు తెరుస్తున్నాడని కిమ్స్ వైద్యులు తెలిపారు. మరోవైపు శ్రీతేజ్ వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ టీమ్ భరిస్తుంది. కాకుంటే శ్రీతేజ్ నార్మల్ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ సైతం రెండు రోజుల క్రితం పరామర్శించి తెలిపారు.
Also Read: Pushpa 2 : 100 ఏళ్ల చరిత్రలో పుష్ప-2 రికార్డు..ఏంటి సామీ ఇది
ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షలను అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ పోలీసులు సైతం కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి 14 రోజులపాటు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ తిరిగి తన నివాసానికి చేరకున్నాడు. అయితే మధ్యంతర బెయిల్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ పై మరోసారి న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. పోలీసుల ఆంక్షల మధ్య అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను పరామర్శించడానికి వీలు కావడంలేదని తెలిసిందే.