Pushpa 2 : 100 ఏళ్ల చరిత్రలో పుష్ప-2 రికార్డు..ఏంటి సామీ ఇది
Pushpa 2 : హిందీలో అత్యధిక కలెక్షన్లు (నెట్) రూ.632.50 కోట్లు సాధించినట్లు పేర్కొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హయ్యెస్ట్ అని, కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు ట్వీట్ చేసింది.
- By Sudheer Published Date - 08:58 PM, Fri - 20 December 24

‘పుష్ప-2’ (Pushpa 2)మూవీ 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్ర(History of Bollywood)లో రికార్డు సృష్టించిందని మూవీ టీమ్ వెల్లడించింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు (నెట్) రూ.632.50 కోట్లు సాధించినట్లు పేర్కొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హయ్యెస్ట్ అని, కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ – సుకుమార్ (Allu Arjun – Sukumar)కలయికలో వచ్చిన పుష్ప 2 అంచనాలు అందుకోవడమే కాదు మారే ఏ చిత్రం కూడా అందుకుంటుందో లేదో అనే రీతిలో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ భాష , ఆ భాష అని కాదు అన్ని భాషల్లో కలెక్షన్ల రికార్డ్స్ ను తిరగరాస్తుంది. డే 1 నుండి ఈరోజు వరకు విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తూ దిగ్గజ సినీ ప్రముఖులను సైతం షాక్ కు గురి చేస్తుంది.
ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్న పుష్ప 2 , తాజాగా హిందీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. రూ.632 కోట్లు కలెక్ట్ చేసి, 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం విశేషం. తద్వారా హిందీలో భారీ నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్) వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
మరోపక్క ‘పుష్ప 2’ కొత్త వెర్షన్ను మేకర్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిడివికి మరో 18 నిమిషాల ఫుటేజ్ కలిపారని, దీనిని ఈ నెల 25 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని టాక్. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు ఉంది. కొత్త సీన్లు కలిపితే 3 గంటల 38ని. కానుంది. కలెక్షన్లు పెంచేందుకు ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది.
Read Also : Toyota Kirloskar Motor : తెలంగాణ గ్రామీణ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న టొయోటా కిర్లోస్కర్ మోటర్