HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Political Parties Celebrations In Telangana Liberation Day

Telangana Liberation Day : ఇది ఎన్నికల సమయం..అందుకే అన్ని పార్టీలకు తెలంగాణ విమోచన దినోత్సవం గుర్తుకొస్తుంది

రేపు(సెప్టెంబరు 17) తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day). గతంలో ఈ రోజును రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.

  • Author : Sudheer Date : 16-09-2023 - 2:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Liberation Day
Telangana Liberation Day

ఎన్నికలు (Elections ) వస్తున్నాయంటే రాజకీయ పార్టీలకు (Political Parties) అందరు గుర్తుకొస్తారు..అన్ని గుర్తుకొస్తాయి..ఏది వదిలిపెట్టకుండా అన్నింటిని గుర్తుపెట్టుకోవడం..గుర్తుచేసుకోవడం చేస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వేడి మొదలైంది. మరో నాల్గు , ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ప్రజలను ఎలా మభ్య పెట్టాలి..ఎలా ఆటలు దండుకోవాలని శతవిధాలా ట్రై చేస్తున్నాయి. అందుకే ఏ దానిని కూడా వదిలిపెట్టడం లేదు.

రేపు(సెప్టెంబరు 17) తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day). గతంలో ఈ రోజును రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం ఎన్నికల సమయం కావడం తో ప్రతి పార్టీ దీనిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఎవరికీ వారు తెలంగాణ విమోచన దినోత్సవం (Telangana Liberation Day 2023)విషయంలో తగ్గేదెలా అంటున్నారు. గత రెండేళ్లుగా బీజేపీ మాత్రమే ఈ వేడుకలను నిర్వహించింది. కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలోని BRS, Congress, AIMIM కూడా ఈ వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. దీంతోపాటు ర్యాలీలు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 17న హైదరాబాద్ మొత్తం రాజకీయ సభలు, అట్టుడికిపోనుంది.

మరోపక్క ఆదివారం అమిత్ షా, రాహుల్ గాంధీ, కె చంద్రశేఖర్ రావు, అసదుద్దీన్ ఒవైసీలు తమ పార్టీల కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు. అయితే ప్రజల మెప్పు పొంది, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని సామాన్య ప్రజలు అంటున్నారు. ఇప్పటివరకు గుర్తురాని తెలంగాణ విమోచన దినోత్సవం..ఇప్పుడు గుర్తువస్తుందంటే దానికి అర్ధం ఎన్నికలే అని ఏమాత్రం తెలియదా..అని ప్రశ్నిస్తున్నారు.

Read Also : APPSC Exam Dates : ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ డేట్లు వచ్చేశాయి.. అభ్యర్థులూ బీ రెడీ

రేపు 1948లో హైదరాబాద్(hyderabad) రాచరిక రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన జ్ఞాపకార్థం మేరకు BRS పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు , నేతలకు ఆదేశాలు జారీ చేసారు సీఎం కేసీఆర్. అలాగే రేపు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇక జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని AIMIM తిరంగా బైక్ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహిస్తోంది. తిరంగా ర్యాలీ దర్గా యూసుఫైన్, నాంపల్లి (నమాజ్-ఎ-జోహార్ తర్వాత) నుంచి హాకీ గ్రౌండ్స్, (ఈడిగా బిలాలీ) మసాబ్ ట్యాంక్ వరకు మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు మాసబ్ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు పాల్గొననున్నారు.

ఇక బిజెపి (BJP) సైతం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జారబోతున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమిత్ షా హాజరుకానున్నారు. సెప్టెంబరు 17, 1948న సర్దార్ పటేల్ పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత తమదేనని బీజేపీ చెబుతోంది. బీజేపీ నిజాం పాలనకు ముగింపు పలకాలని భావిస్తోంది. అలా చేయడం ద్వారా, అధికార BRS మరియు దాని ‘స్నేహపూర్వక’ భాగస్వామి AIMIM రెండింటినీ లక్ష్యంగా చేసుకోవాలని BJP లక్ష్యంగా పెట్టుకుంది.

మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం ఈరోజు , రేపు CWC సమావేశాలను హైదరాబాద్ లో జరపబోతున్నారు. అలాగే రేపు సాయంత్రం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు సోనియా , రాహుల్ , ప్రియాంక తదితరులు హాజరుకానున్నారని తెలిపింది టి కాంగ్రెస్. ఇలా మొత్తం మీద ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు దేనిని వదిలిపెట్టడం లేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIMIM
  • bjp
  • brs
  • congress
  • hyderabad
  • Political Parties Celebrations
  • Telangana Liberation Day

Related News

Lionel Messi Photo

Lionel Messi in HYD: వామ్మో ..మెస్సీ తో ఫోటో దిగాలంటే రూ.9.95లక్షలు చెల్లించాలి !!

Lionel Messi in HYD: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన 'ద గోట్ టూర్' (The GOAT Tour)లో భాగంగా ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు

  • Gold And Silver Rate Today

    Gold Price : ఈరోజు బంగారం ధర తగ్గింది.. సిల్వర్ రేటు పెరిగింది !

  • Global Summit

    Global Summit: గ్లోబల్ సమ్మిట్‌.. తెలంగాణ‌కు వ‌చ్చిన పెట్టుబ‌డులు ఎంతంటే?!

  • Revanth Ou

    CM Revanth to Visit OU : ఓయూకు రూ.1000కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్

  • Hyd Hyd Skywalk

    Skywalk : హైదరాబాద్‌లో కొత్త స్కైవాక్‌లు

Latest News

  • IND vs SA: తిల‌క్ ఒంట‌రి పోరాటం.. రెండో టీ20లో ఓడిన టీమిండియా!

  • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

  • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ చెత్త‌ రికార్డు.. T20I చరిత్రలో అత్యంత పొడవైన ఓవర్!

  • Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

Trending News

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

    • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

    • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd