Telangana
-
N Convention : నాగార్జున నిజమైన హీరో – సీఎం రేవంత్
N Convention : హీరో నాగార్జున (Nagarjuna) కు చెందిన N-కన్వెన్షన్(N Convention) కూల్చివేత ఉదాహరణగా చూపారు.
Date : 28-06-2025 - 7:48 IST -
PJR flyover : వాహనదారులకు ఊరట..పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ ఫ్లైఓవర్ సముదాయాన్ని 1.2 కిలోమీటర్ల పొడవుతో, ఆరు వరుసల (లేన్ల)తో, సుమారు 24 మీటర్ల వెడల్పుతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద రోజూ ఎదురయ్యే తీవ్ర రద్దీ నుంచి విముక్తి కలిగించేందుకు ఇది కీలకంగా మారనుంది.
Date : 28-06-2025 - 6:44 IST -
Telangana Police : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
ఈ బదిలీల్లో భాగంగా పలువురు అధికారులకు ముఖ్యమైన నియామకాలు చేయడం గమనార్హం. వై. నాగేశ్వరరావును సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) కు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా నియమించారు.
Date : 28-06-2025 - 6:23 IST -
Hanmakonda : వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను వివస్త్రను చేసి ప్రవైట్ ప్రైవేట్ భాగాల్లో జీడిపోసారు
Hanmakonda : వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కుటుంబ సభ్యులు అత్యంత హీనంగా వ్యవహరించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి
Date : 28-06-2025 - 6:22 IST -
Telangana : తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇప్పటికే రెండు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకూ నోటిఫికేషన్ వెలువడగా, ఇప్పుడు మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం కూడా ప్రకటన విడుదల కావడం విశేషం. అభ్యర్థులు జూలై 10వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-06-2025 - 4:15 IST -
BJP Presidents : మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులు
BJP Presidents : ఈ ఎన్నికల కోసం అధికారిగా లక్ష్మణ్‌ను నియమించినట్టు హైకమాండ్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమేనని, అసలు ఎంపికలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.
Date : 28-06-2025 - 4:07 IST -
Harish Rao : జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి ‘దగా క్యాలెండర్’ అమలు చేస్తున్నారు: హరీశ్ రావు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది.
Date : 28-06-2025 - 3:52 IST -
Mahaa News : మహాన్యూస్ ఆఫీస్ పై దాడి..లోపల ఫేమస్ హీరో
Mahaa News : ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రసారం చేసిన కథనాల్లో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించడంపై BRS కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు
Date : 28-06-2025 - 3:43 IST -
Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. తెరపైకి కవిత పీఏ పేరు
సిట్ ఆధికారులు తాజాగా ప్రాథమికంగా సేకరించిన ఆధారాల నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో నుండి బయటపడిన కొన్ని ఆడియో రికార్డింగులు దర్యాప్తును మరింత ఉత్కంఠతో నింపుతున్నాయి.
Date : 28-06-2025 - 12:06 IST -
Anchor Sweccha Votarkar : మానసిక వేదింపులు తట్టుకోలేక యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకుందా..?
Anchor Swetcha Votarkar : ఆమె మృతికి కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి. స్వేచ్ఛ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన కుమార్తెతో పాటు పూర్ణచంద్రరావుతో సహజీవనం చేస్తోంది
Date : 28-06-2025 - 11:58 IST -
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Date : 28-06-2025 - 11:47 IST -
Telangana : జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ నెల 30వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. జూన్ 1 నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదే రోజున నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. అయితే పోటీ ఉంటే జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Date : 28-06-2025 - 11:27 IST -
Local Body Elections : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నేతల మధ్య రగడ..?
Local Body Elections : బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది
Date : 28-06-2025 - 9:22 IST -
Amit Shah : నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 27-06-2025 - 8:16 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 27-06-2025 - 5:09 IST -
Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం
ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో న్యాయవాదులు కె.రఘునాథ్ రావు, వెంకటరామ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు.
Date : 27-06-2025 - 4:49 IST -
TGEAPCET : టీజీఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన ఈఏపీసెట్ (EAPCET) కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మూడు విడతలుగా ఈ ప్రవేశ కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Date : 27-06-2025 - 4:17 IST -
Maoist : మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరికల లేఖ..!
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వివక్ష చూపుతుంటే, గిరిజనుల నేతగా ఉన్న మంత్రి మాత్రం స్పందించకపోవడం పట్ల మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు తీసుకుంటున్న ఆంక్షలు, అటవీ శాఖ దాడుల గురించి వివరంగా రాశారు.
Date : 27-06-2025 - 3:32 IST -
Hyderabad : తల్లి ప్రాణం విలవిల.. స్కూల్‌కి వెళ్తున్న బాలుడిని ఢీకొట్టిన టిప్పర్
Hyderabad : స్కూల్ సమయాల్లో హెవీ వాహనాల రాకపోకలు నియంత్రించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు
Date : 27-06-2025 - 12:17 IST -
Telangana : నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
పరిపాలనా వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల (కేబినెట్ మీటింగ్‌లు) నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చుతున్నారు.
Date : 27-06-2025 - 11:09 IST