HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Ktr Slams Revanth Reddy 50 Delhi Visits No Results

KTR : హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు

KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • By Kavya Krishna Published Date - 12:38 PM, Sat - 2 August 25
  • daily-hunt
Ktr
Ktr

KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టులో, రేవంత్ ఇప్పటివరకు ఢిల్లీకి చేసిన పర్యటనలు 50 సార్లు చేరుకున్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, ఈ యాత్రలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని మండిపడ్డారు.

కేటీఆర్ తన పోస్ట్‌లో కాంగ్రెస్ పాలనను కడిగిపారేశారు. “ఈ ప్రభుత్వం ఫైల్స్‌తో రాష్ట్రాన్ని నడపడం లేదు. ఫ్లైట్ బుకింగ్స్‌తోనే పాలన కొనసాగుతోంది,” అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తూ, “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి చేసిన మూడు ప్రధాన పనులు ఇవే: మొదటిది – ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం; రెండోది – ఢిల్లీకి వెళ్ళడం; మూడోది.. ఖాళీ చేతులతో తిరిగి రావడం..” అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీకి వెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేదు. పొలాల్లో జల్లడానికి యూరియా లేదు. సాగు నీళ్లు రావు, తాగునీళ్లు కూడా లేవు,” అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

“కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల మరమ్మతు పనులను ఆపేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ శాశ్వత నష్టం పొందుతుంది అనే అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు,” అని వ్యాఖ్యానించారు.

Asthma : చికిత్స ఉన్నా పిల్లల్లో ఆస్తమా ముదిరే కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు

అదేవిధంగా, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, నాలుగు వేల రూపాయల పెన్షన్, తులం బంగారం హామీలు, గురుకుల విద్యార్థుల సమస్యలు అన్నీ నిర్లక్ష్యం చెయ్యబడ్డాయని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై కేటీఆర్ మరింత వ్యంగ్యంగా స్పందించారు. “రాష్ట్ర సమస్యలపై శ్రద్ధ చూపే సమయం లేని ముఖ్యమంత్రి, 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతూ ఢిల్లీ వెళ్తున్నారు. వస్తున్నారు. కానీ ఆయన యాత్రల ఫలితం ఏమిటి?” అని ప్రశ్నించారు.

“ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు – హస్తిన యాత్రలు ఇప్పటికి 50 సార్లకు చేరుకున్నాయి. కానీ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు.. శుష్కప్రియాలు, శూన్య హస్తాలు… అయినా పోయి రావలె హస్తినకు.. ఈ ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు లభించింది ఏమిటి?” అని ప్రశ్నించారు.

“నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ… తెలంగాణకు అవసరమైనది రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి. ఢిల్లీ యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు,” అంటూ కేటీఆర్ తన వ్యాఖ్యలను ముగించారు.

Tesla : టెస్లాకు షాక్.. రూ.2,100 కోట్ల భారీ జరిమానా విధించిన ఫ్లోరిడా కోర్టు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banakacharla Project
  • brs vs congress
  • Delhi Visits
  • Farmers Issues
  • kaleshwaram project
  • ktr
  • revanth reddy
  • Telangana Government Criticism
  • telangana politics

Related News

Harish Rao

Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

హరీష్ రావు మాట్లాడుతూ.. 2012-13లో మొదటిసారి లండన్ వచ్చినప్పుడు అనిల్ కుర్మాచలం మొదటి ఎన్నారై సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎ

  • That's why I resigned from BRS.. Kadiam Srihari's key comments

    Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

  • Raghunandan Rao

    Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

  • KCR values ​​the party more than his family.. Mallareddy's response to Kavitha's suspension

    Malla Reddy : కేసీఆర్‌కు కుటుంబం కన్నా పార్టీ మిన్న.. కవిత సస్పెన్షన్‌పై మల్లారెడ్డి స్పందన

  • Cm Revanth Reddy

    Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం

Latest News

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd