HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavitha Fire On Mla Jagadish Reddy

MLC Kavitha Fire: బీఆర్ఎస్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారుతున్న క‌విత‌.. పార్టీ కీల‌క నేతపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ఈ సమావేశంలో కవిత మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో ఒక ముఖ్య నాయకుడు తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టి సమాచారం సేకరిస్తున్నాడని ఆరోపించారు.

  • Author : Gopi Date : 03-08-2025 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Kavitha Fire
MLC Kavitha Fire

MLC Kavitha Fire: బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పార్టీ ఎమ్మెల్సీ కవిత.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు (MLC Kavitha Fire) చేశారు. పత్రికా సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో రాజకీయ వేడిని మరింత పెంచాయి.

కవిత చేసిన విమర్శలు

కవిత.. జగదీష్ రెడ్డిని “లిల్లీ పుట్ నాయకుడు” అని సంబోధించారు. “నా గురించి కామెంట్స్ చేస్తాడా” అంటూ ఘాటుగా స్పందించారు. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీని నాశనం చేసి “చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు” ఏదో గెలిచాడని కవిత విమర్శించారు. జిల్లాలోని అన్ని సీట్లలో పార్టీ ఓడిపోవడానికి జగదీష్ రెడ్డియే కారణమని ఆమె ఆరోపించారు. జగదీష్ రెడ్డిపై మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కవిత హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.

Also Read: Ind vs Pak Match: జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డ‌బ్బే ముఖ్యం.. ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

కోవర్టుల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు

ఈ సమావేశంలో కవిత మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో ఒక ముఖ్య నాయకుడు తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టి సమాచారం సేకరిస్తున్నాడని ఆరోపించారు. ఆ నాయకుడికి హెచ్చరిక చేస్తూ “మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు” అని అన్నారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాల వల్లే తనపై జరుగుతున్న దాడులపై పార్టీ నాయకులు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉందని కూడా కవిత వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో సీనియర్ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరును, విభేదాలను బహిర్గతం చేశాయి.

బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటా

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు తాను రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాను బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటానని చెప్పారు. ఈ ఇష్యూకు తెర‌ప‌డితే అన్ని విష‌యాలు స‌ర్దుకుపోతాయ‌న్నారు. అంతేకాకుండా త‌న ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్టే ప‌నికూడా ఎప్పుడూ ప‌నిచేయ‌న‌ చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS Politics
  • kcr
  • ktr
  • MLA Jagadish Reddy
  • MLC Kavitha
  • MLC Kavitha Fire

Related News

KTR- Harish Rao

BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్

    Latest News

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

    • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

    • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

    • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd