KGBV Teachers: కేజీబీవి ఉపాధ్యాయులకు మంత్రి పొన్నం కీలక పిలుపు!
తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.
- By Gopichand Published Date - 11:19 AM, Tue - 31 December 24

KGBV Teachers: గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న దాదాపు 19,500 మంది సర్వ శిక్షా ఉద్యోగులు కేజీబీవి ఉపాధ్యాయులు (KGBV Teachers) విద్యార్థుల భవిష్యత్ శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కోరారు. సమ్మె చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని కేజీబీవీ పాఠశాలల్లో బడగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని సమ్మె చేస్తూ వారిని అక్కడ చదువుతున్న విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని సర్వ శిక్షా ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. సర్వ శిక్షా కస్తూర్బా గాంధీ పాఠశాలు కేంద్రం పరిధిలో 60 శాతం రాష్ట్రం పరిధిలో 40 శాతం ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వ శిక్షా ఉద్యోగుల సమస్య తెలంగాణలోనే లేదని దేశ వ్యాప్తంగా ఉందని కేంద్ర ప్రభుత్వం కోరితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామని మంత్రి పొన్నం వెల్లడించారు.
Also Read: Rohit Quit Test Cricket: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఆ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్?
25 రోజులుగా కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేయడం వల్ల వారికి విద్యాబోధన జరగక తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే సమ్మె విరమించి ఉద్యోగులు విధుల్లో చేరాలని కోరారు. సమ్మె విరమిస్తే వారి సమస్యల పై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పడిన సబ్ కమిటీ తో సమావేశానికి పిలుస్తమని సబ్ కమిటీ లో తనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు కూడా ఉన్నారని సబ్ కమిటీలో సర్వ శిక్షా ఉద్యోగుల సమస్యల పై చర్చిస్తామని పేర్కొన్నారు. నాన్ ఫైనాన్సియల్ డిమాండ్స్ లో మహిళా ఉద్యోగులకు మెటర్నరి లీవ్స్, సీఎల్ లు, తదితర వాటిపై సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పరిష్కరమయ్యేలా ప్రభుత్వం చూస్తుందని, ఆర్థికపరమైన డిమాండ్స్ పై సబ్ కమిటీ లో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సర్వ శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు