HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ktr Counter To Rahul Gandhi Khammam Public Meeting Comments

KTR vs Rahul: మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..మీదే భారత రాబందుల పార్టీ

ఖమ్మం జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై అధికార పార్టీ అగ్ర నేతలు ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా చురకలంటించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 03-07-2023 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR vs Rahul
New Web Story Copy 2023 07 03t114705.626

KTR vs Rahul: ఖమ్మం జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై అధికార పార్టీ అగ్ర నేతలు ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా చురకలంటించారు. బీఆర్ఎస్ బీజేపీ బంధువుల పార్టీ అన్న రాహుల్ కామెంట్స్ పై కేటీఆర్ మాట్లాడుతూ…మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..మీదే భారత రాబందుల పార్టీ అంటూ ధ్వజమెత్తారు. ఏఐసీసీ అంటేనే…అఖిల భారత కరప్షన్ కమిటీగా అభివర్ణించారు. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అన్నారు. స్కాములే తాచుపాములై.. మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదన్నారు.

మా పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని, కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ అంతకన్నా కాదని స్పష్టం చేశారు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ఢీ టీమ్ మా బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సేనంటూ విమర్శించారు. రాహుల్ కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఘాటుగా ప్రశ్నించారు. అర్థంలేని ఆరోపణలు చేసి..ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారన్నారు.

తెలంగాణ ప్రజలు కోరుతోంది నిర్మాణాత్మక ప్రతిపక్షమని, అయితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదని చురకలంటించారు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని స్పష్టం చేశారు. కర్ణాటకలో “అన్నభాగ్య” హామీని గంగలో కలిపిన కాంగ్రెస్ తెలంగాణాలో 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు?. కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదని చెప్పారు. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదు – సమర్థత అంతకన్నా కాదని రాహుల్ పై మండిపడ్డారు.

సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..? కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోండంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 4.6 లక్షల ఎకరాలు పంచి అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అని చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు, జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కొమరం భీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసిఆర్ గారని చెప్పారు. మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు, మా పాలనలో మన్యానికి మంచిరోజులన్నారు.

తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ మాది. బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కారు స్టీరింగ్ కేసిఆర్ గారి చేతిలో పదిలంగా ఉంటుంది కానీ కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పిందని ఎద్దేవా చేశారు. మా తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానం. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయం. కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలం అని చెప్పారు కేటీఆర్.

Read More: Drones: వాహనదారులపై డ్రోన్ నిఘా, హద్దు మీరితే చలాన్ కట్టాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • brs vs congress
  • congress
  • Jana Garjana
  • khammam
  • ktr
  • ktr vs rahul
  • rahul gandhi
  • Strong Counter
  • telangana

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • One Lakh New Pensions In Te

    New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd