Hydra: ‘హైడ్రా’ కారణంగా ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదు: మల్లారెడ్డి
Hydra: రాష్ట్రంలో హైడ్రా ప్రజలను హైరానాకు గురి చేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లను కూల్చివేసి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
- By Latha Suma Published Date - 05:44 PM, Wed - 25 September 24

Malla Reddy comments on Hydra: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘హైడ్రా’ కారణంగా ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదని అన్నారు. అందరిలాగే తనకూ హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు. తన కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని అని అన్నారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్డు మీద పడేయడం అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలు అని, ఒక్కో మంత్రి ఒక్కో గ్రూపును తయారు చేశారని విమర్శించారు.
Read Also: Mahadhan : అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తబోతున్న రవితేజ కొడుకు..
రాష్ట్రంలో హైడ్రా ప్రజలను హైరానాకు గురి చేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లను కూల్చివేసి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏదో యుద్ధం చేసినట్లుగా ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను ఓ సవాల్ చేస్తున్నానని, కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్లకు పాలాభిషేకం చేస్తానన్నారు. రేవంత్ పాలనలో రైతు భరోసా లేదని, రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.