KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
- Author : Gopichand
Date : 15-01-2025 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
KTR To ED: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణ చేసేందుకు ఈడీ (KTR To ED) సిద్ధమైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు. 16వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ రెండోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. FEO కంపెనీకి హెచ్ఎండిఏ నిధులను ఆర్బీఐ రూల్స్‌కు విరుద్ధంగా అధికారులు బదిలీ చేసినట్లు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారణ చేసింది. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ను ఈడీ విచారించనుంది. కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు బదిలీ చేశామని అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనపై ఏసీబీ నమోదు చేసిన FIR ను క్వాష్ చేయాలని నేడు సుప్రీంకోర్టు వెళ్లిన కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
Also Read: Harish Rao: మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
ఇప్పటికే కేటీఆర్‌ను ఈ కేసు విషయంలో ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఒక లొట్టపీసు కేసు అని కేటీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తమపై సీఎం రేవంత్ కక్ష సాధింపు చర్యల కోసం ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్, కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫార్ములా ఈ కార్ రేసు వలన హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగిందని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేటీఆర్ అంటున్నారు. విచారణకు 24 గంటలు అందుబాటులోనే ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ పంపిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు అడిగారని ఆయన అన్నారు. మరీ రేపు ఈడీ విచారణలో కేటీఆర్‌కు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాబోతున్నాయో చూడాలి.