HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Serious Warning To Officers

KTR: ‘మళ్లీ అధికారంలోకి వస్తాం, లెక్కలు సెటిల్ చేస్తాం’: కేటీఆర్

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.

  • Author : Gopi Date : 07-08-2025 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR
KTR

KTR: తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగిలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం,
CM రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని పొగడటంలో అతిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక లెక్కలు సెటిల్ చేస్తామని హెచ్చరించడం సంచలనం సృష్టించింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు, రాజకీయ డ్రామాలు

ఎమ్మెల్యేల గందరగోళం

కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కేటీఆర్ స్పందించారు. “కాలే యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో పక్కనే ఉన్న స్పీకర్‌కు తెలియడం లేదు” అని వ్యంగ్యంగా అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ విచిత్రమైన వ్యక్తిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు ఎత్తనిది నిద్ర పట్టదని, రాత్రి కలల్లో కూడా కేసీఆర్ పేరు తలుచుకుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిది రాహుల్ గాంధీతో దోస్తీ డ్రామా అని, మోడీతో కుస్తీ డ్రామా అని, చంద్రబాబు జలదోపిడీపై ఫైటింగ్ విషయంలో పెద్ద డ్రామా అని విమర్శించారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టి అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి జడ్పీటీసీ కాకముందే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారని గుర్తు చేశారు.

Also Read: Green Energy Corridor: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు అనుమతివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన డిప్యూటీ సీఎం!

ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆగ్రహం

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అధికారులు అనడంపై ఆయన మండిపడ్డారు. “మళ్లీ వచ్చేది మేమే. మీ లెక్కలన్నీ సెటిల్ చేస్తాం. ఎవరెవరు ఎగిరిపడ్డారో వారి సంగతి చూస్తాం” అని తీవ్రంగా హెచ్చరించారు.

బీఆర్ఎస్‌కు మద్దతు కోరిన కేటీఆర్

పరిగి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏడు జడ్పీటీసీలు, ఏడు ఎంపీపీలు బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అప్పుడు అధికారులు తమ చుట్టూ తిరుగుతారని ఆయన భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో పడిపోయిన రియల్ ఎస్టేట్

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి అత్తా-కోడళ్ళ మధ్య పంచాయతీ పెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పని తాను చేసుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం డీలా పడటంతో దాన్ని సెట్ చేసుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • kcr
  • ktr
  • telangana
  • TG News

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం

    • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd