HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Responds For The First Time On Mlc Kavithas Suspension What Does He Mean

KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • By Latha Suma Published Date - 05:28 PM, Mon - 8 September 25
  • daily-hunt
KTR responds for the first time on MLC Kavitha's suspension..what does he mean..?
KTR responds for the first time on MLC Kavitha's suspension..what does he mean..?

KTR : తెలంగాణ రాజకీయాల్లో కలవరం రేపిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి సస్పెండ్‌ కావడంపై రాజకీయ వేడి పెరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తొలిసారిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆమె సోదరుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ విషయం మీద మళ్లీ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ సూటిగా వ్యాఖ్యానించారు. పార్టీ శ్రమించి ఎదిగింది, ఎవరైనా గౌరవంగా వ్యవహరించాలి అనే స్పష్టత ఆయన మాటల్లో కనిపించింది.

Read Also: Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్

కాగా, తాజాగా కవిత ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. నన్ను అక్రమంగా పార్టీ నుంచి తొలగించారు. నేను ఎప్పుడూ పార్టీ వ్యతిరేకంగా పనిచేయలేదు. నా ఎదుగుదల, కార్యకలాపాలు కొంతమందికి ఇష్టంలేక కుట్రలు పన్నుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ఒక్క ఫోన్‌కైనా అడిగే బాధ్యత తీసుకోలేదు. 103 రోజులుగా ఆయన నాతో మాట్లాడలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా హరీష్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌రావుపై ఆమె చేసిన విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రామన్నా హరీష్‌, సంతోష్‌ మీతో ఉన్నట్టుగా కనిపించొచ్చు. కానీ వాళ్లు పార్టీకి, తెలంగాణకు మేలు చేయాలనే ఆలోచనలో లేరు. వాళ్లను పక్కనపెడితేనే పార్టీకి ప్రాణం ఉంటుంది. నాన్న (కేసీఆర్) పేరు నిలబడుతుంది అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

తనపై తీసుకున్న చర్యలపై స్పందిస్తూ నన్ను సస్పెండ్‌ చేయడంపై వ్యక్తిగతంగా బాధపడను. కానీ, ఈ వ్యవహారంపై ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ భవన్‌లో మహిళా నేతలు స్పందించడం కొంత ఊరట ఇచ్చింది. ఇది నాటకమా? లేక మహిళా నాయకత్వానికి కొత్త నిర్వచనమా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక, పై కవిత ఏ దిశగా వెళ్లనున్నదన్నది ఆసక్తికర అంశం. బీఆర్ఎస్ పార్టీ ఆమెకు తలుపులు మూసేసినట్లే కనిపిస్తున్నా, ఆమె వ్యాఖ్యలు చూస్తే సుస్పష్టంగా ఆమె రాజకీయంగా వెనక్కి తగ్గే రీతిలో లేరు. అటు కేటీఆర్ స్పందన కూడా తేలికపాటి దాని కాదు పార్టీ శ్రేణుల్లో అంతర్గత విభేదాలు మరింత స్పష్టమవుతున్నాయి.

Read Also: Nandamuri Balakrishna : నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది హీరో బాలకృష్ణ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • ktr
  • MLC Kavitha suspension
  • telangana
  • telangana bhavan

Related News

Cm Revanth Request

2029 Assembly Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ – సీఎం రేవంత్

2029 Assembly Elections : తెలంగాణ రాజకీయ వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు విశేష చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై చేసిన

  • CM Revanth

    Jubilee Hills Bypoll : హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

  • Congress

    Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఫలితం ఏంటో తెలిసే KCR ప్రచారం చేయలేదు – సీఎం రేవంత్

  • Bandi Sanjay Maganti

    Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Private Colleges

    Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

Latest News

  • ‎Alcohol: ఏంటి ఇది నిజమా! చలికాలంలో మద్యం తాగితే చలి తగ్గుతుందా?

  • ‎Cardamoms: పొట్ట నిండా తిన్న తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Curd: కేవలం ఒక చెంచా పెరుగుతూ ముఖాన్ని, జుట్టుని షైనీగా మార్చుకోండిలా?

  • ‎Flowers Plants: ఈ పూల మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. కనక వర్షం కురవాల్సిందే!

  • ‎Karthika Masam 2025: కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజు ఇలా పూజ చేస్తే చాలు.. శివ అనుగ్రహం కలగాల్సిందే!

Trending News

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd