Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్
Vande Bharat : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు కేవలం చైర్‌కార్ మోడల్‌లో మాత్రమే నడుస్తున్నాయి.
- By Kavya Krishna Published Date - 05:20 PM, Mon - 8 September 25

Vande Bharat : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు కేవలం చైర్‌కార్ మోడల్‌లో మాత్రమే నడుస్తున్నాయి. ఇవి పగటి ప్రయాణాలకు అనుకూలంగా ఉండటంతో, రాత్రి ప్రయాణాలకు కొత్త సౌకర్యాల అవసరం అనిపించింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపకల్పన చేసిన స్లిపర్ కోచ్ మోడల్ వందే భారత్ రైలును తొలిసారి ప్రవేశపెట్టబోతోంది.
ఈ రైలును దీపావళి పండుగ సమయానికి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. పండుగ సీజన్‌లో ముఖ్యంగా ఢిల్లీ–పాట్నా మార్గం అత్యంత రద్దీగా మారుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది బీహారీయులు స్వగ్రామాలకు చేరుకునేందుకు రైళ్లు, బస్సుల్లో తీవ్ర కిక్కిరిసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ మొదటి వందే భారత్ స్లిపర్ ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీ–ప్రయాగ్‌రాజ్–పాట్నా కారిడార్‌లో నడపాలని నిర్ణయించింది.
Nandamuri Balakrishna : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది హీరో బాలకృష్ణ
ప్రస్తుతం ఢిల్లీ–పాట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సగటున 23 గంటల సమయం పడుతోంది. అయితే ఈ కొత్త వందే భారత్ స్లిపర్ రైలు కేవలం 11 గంటల్లోనే గమ్యానికి చేరుస్తుంది. అంటే దాదాపు 12–17 గంటల సమయం ప్రయాణికులు ఆదా చేసుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం, రాత్రి 8 గంటలకు ఢిల్లీ నుండి బయల్దేరిన రైలు, మరుసటి రోజు ఉదయం 7.30కి పాట్నా చేరుతుంది. అదే విధంగా తిరిగి పాట్నాలో రాత్రి 8 గంటలకు బయల్దేరి, ఢిల్లీకి చేరుతుంది.
ఈ స్లిపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పాటు, సీసీటీవీ నిఘా వ్యవస్థ, సెన్సార్ తలుపులు, అగ్నిమాపక పరికరాలు అమర్చబడ్డాయి. ప్రతి కోచ్‌లో విమానాల తరహా ఇంటీరియర్ డిజైన్, వినోద తెరలు, సౌకర్యవంతమైన బెర్త్‌లు కల్పించారు. దీంతో ప్రయాణికులు రాత్రి సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకుంటూ గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లు ప్రధానంగా పగటి ప్రయాణాలకు అనువైన చైర్‌కార్ మోడల్‌లోనే నడుస్తున్నాయి. అయితే కొత్తగా వస్తున్న ఈ స్లిపర్ కోచ్ వేరియంట్, ముఖ్యంగా రాత్రిపూట సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని వల్ల దీర్ఘకాలిక రైలు ప్రయాణాల సమయంలో ప్రజలకు సౌకర్యం మరింత మెరుగుపడనుంది. దీంతో, దీపావళి పండుగ సీజన్ నుంచే భారతీయులు తమ కలల వందే భారత్ స్లిపర్ రైలులో ప్రయాణించే అవకాశం దక్కనుంది.
Visakhapatnam : మళ్లీ ఈఐపీఎల్‌లో మంటలు ..నేవీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్