KTR : ఊహించని పరిణామం.. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్
KTR : కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఊహించని విధంగా మారాయి. కేటీఆర్ విచారణలో పాల్గొనకుండా, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన సమయంలో, 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ బృందం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
- By Kavya Krishna Published Date - 11:29 AM, Mon - 6 January 25

KTR : తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేసు కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణలో హాజరుకావాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శాఖ నోటీసులు ఇచ్చింది. అయితే.. ఈ నేపథ్యంలోనే విచారణ కోసం కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఊహించని విధంగా మారాయి. కేటీఆర్ విచారణలో పాల్గొనకుండా, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన సమయంలో, 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ బృందం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
విచారణ సమయంలో, కేటీఆర్ తన లాయర్‌ను లోపల అనుమతించాలని కోరినా, పోలీసులు కోర్టు ఉత్తర్వుల ప్రకారం లాయర్‌ను అనుమతించడానికి తడబాటు చూపించారు. ఈ నిర్ణయంతో కేటీఆర్ అంగీకరించకపోవడంతో, ఆయన లాయర్‌ను అనుమతించాలని పోలీసులు తెలియజేస్తే, కేటీఆర్ దీనిని నిరసిస్తూ, అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Attack On Pak Army : పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై సూసైడ్ ఎటాక్.. 47 మంది సైనికులు మృతి ?
అయితే, కేటీఆర్ స్టేట్‌మెంట్ ప్రకారం, ఆయన రాతపూర్వకంగా తన సమాధానాన్ని అందించినట్లు తెలిపారు. “నాకు ఇవ్వబడిన నోటీసులో నేను ఏఎస్పీకి నా స్టేట్‌మెంట్ అందించినాను,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, “రాజమౌళి కంటే పోలీసులు కథలు ఎక్కువగా రాస్తున్నారు” అని, ఆయన పోలీసులను నమ్మడంలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ తన లాయర్లను అంగీకరించకపోవడంపై కూడా ప్రశ్నించారు. “లాయర్ ఉంటేనే నా హక్కుల రక్షణ ఉంటుంది. ఇలావుంటే, ఎందుకు అడ్వకేట్‌లతో వస్తే ఇబ్బంది?” అని ఆయన ప్రశ్నించారు. అనంతరం, కేటీఆర్ అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరారు.
అయితే.. ఈ కేసులో కేటీఆర్ గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరారు. విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు వెల్లడించడాన్ని నిలిపి ఉంచుతూ, అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని అధికారులను ఆదేశించింది. అయితే, విచారణ కొనసాగించేందుకు అనుమతించింది.
PK Arrest : నిరాహార దీక్ష చేస్తున్న పీకే అరెస్ట్.. కోర్టుకు వెళ్తానన్న ప్రశాంత్ కిశోర్