Sharmila: తెలంగాణ రాజకీయాలపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
- By Vamsi Chowdary Korata Published Date - 01:01 PM, Thu - 8 December 22

టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం వైఎస్ఆర్ టిపి (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి (Komati Reddy) వెంకటరెడ్డి (Venkatreddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. షర్మిల (Sharmila) ఘటనను అందరూ ఖండించాలని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. మరో ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు చెపుతానని అన్నారు. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం అనుకుంటోందని టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
Also Read: BJP : డిసెంబర్ 15న తెలంగాణకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా