HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Sensation Comments About Telangana Slang In Telugu Movies

CM KCR: తెలంగాణ యాస ఉంటేనే.. తెలుగు సినిమా హిట్ అవుతోంది..!

  • Author : HashtagU Desk Date : 09-03-2022 - 1:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr Job Notification
Cm Kcr Job Notification

తెలంగాణ‌లో రెండో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్ర‌ నిరుద్యోగుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌ణ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స‌భ‌లో ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగాన్ని ఆరంభించారు. ఉద్యమ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయో తెలిపిన కేసీఆర్, 14 ఎళ్ళ‌ సుదీర్ఘ ఘర్షణ తరువాత తెలంగాణ సాకారమైందన్నారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష అన్యాయాలతో తెలంగాణ రాష్ట్రం వెనుక బడిపోయిందని, ప్రజలు చాలా క్షోభ, బాధలను అనుభవించారని కేసీఆర్ మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.

కొత్త రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు తెలంగాణ ప్రజలు ఆకలి చావులు చూశాన‌ని కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఉద్యోగాలు లేక యువత ఆయుధాలను చేత బట్టి ఉద్యమం వైపు వెళ్లారని కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్ర సమయంలో నిధులు, నీళ్లు, నియామకాలపై తెలంగాణపై వివక్షత చూపించారని, దీంతో ఈ మూడు సాధించటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత మన నీళ్లు తెచ్చుకున్నాం, మన నిధులు మనమే తెచ్చుకున్నామ‌ర‌ని కేసీఆర్ తెలిపారు.

అలాగే తెలంగాణ‌ రాష్ట్ర ఏర్ప‌డ్డాక ప్రతి రూపాయి మన ప్రజల కోసమే వినియోగపడిందని, నీళ్లు, నిధుల విషయంలో ముందడుగులో ఉన్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ఇక రాజకీయాలంటే ఇతర పార్టీలకు ఒక‌ గేమ్ అని కేసీఆర్ విమర్శించారు. మ‌రోవైపు టీఆర్ఎస్‌కు మాత్రం రాజకీయాలంటే టాస్క్ అని, కేసీఆర్ అన్నారు. ఇప్పుడు అడ్డం పొడవు మాట్లాడేవాళ్లు గతంలో ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. వ్యక్తిగతంగా తనను కూడా నిందించిన చిల్లగరాళ్లు అని వదిలిపెట్టామని చెప్పారు. తమ ఏకాగ్రత, లక్ష్యం దెబ్బ తినొద్దని అనుకున్నామని తెలిపారు.

తమ లక్ష్యం తెలంగాణ ప్రజలకు మంచి చేయడం.. అందులో తాము సఫలీకృతం అయ్యామని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నీటి కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఇక రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్ర‌భుత్వం విముఖత చూపుతుందని తెలిపారు. ఉద్యోగ‌ నియామకాలపై, తెలంగాణ ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విధాలా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలు ఒకప్పుడు సినిమాలలో కేవలం కమెడియన్లుగా, జోకర్లుగా మాత్రమే చేసేవారని.. కానీ ఇపుడు తెలంగాణ యాస వాడితేనే సినిమా హిట్ అవుతుంటాని, అలాగే తెలంగాణ భాష మాట్లాడే హీరో ఉంటే సినిమా స‌క్సెస్ అవుతోంద‌ని తెలుగు సినిమా వాళ్ళ‌కు కూడా త‌న‌దైన్ పంచ్ ఇచ్చారు కేసీఆర్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • Telangana Language
  • Telangana Slang
  • Telugu Cinema
  • tollywood
  • trs

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

  • Pandu Master Health Update

    Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

Latest News

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd