Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
- By Gopichand Published Date - 04:26 PM, Wed - 13 November 24

Indiramma Houses: గాంధీభవన్‌లో బుధవారం మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చిన ప్రజలు మంత్రికి అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి పాత్రికేయులతో మాట్లాడారు. లగచర్ల సంఘటనలో అసలు దోషులను త్వరలో మీడియా ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. పింక్ కలర్ ముసుగు అడ్డంపెట్టుకొని విధ్వంసం సృష్టిస్తున్నదెవరో ప్రజలకు తెలుసు అన్నారు. ప్రజా సేవ చేసే అధికారులపై దాడులను సహించబోమని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి బుధవారం ప్రజలను కలిసేందుకు గాంధీభవన్‌లో మీ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ”2 నెలలుగా మంత్రితో ముఖాముఖి ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), ధరణి సమస్యలు ఎక్కువగా నా దృష్టికి వచ్చాయి. ఎక్కువ దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల గురించే వచ్చాయి. మొదటి విడతగా 4 నుంచి 5 లక్షలు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సీఎస్కే సీఈవో విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు..
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. లబ్దిదారుల ఎంపికకు పైరవీలు అవసరం లేదు. కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాము. అసెంబ్లీలో కొత్త చట్టం వివరాలు వెల్లడిస్తాం. ప్రతిపక్ష నేతలు సలహాలు కూడా కొత్త చట్టంలో తీసుకుంటామన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త ఆర్వోఆర్ చట్టం 2024ను తీసుకురాబోతున్నామని” మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రతి నియోజవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామన్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి నాలుగు విడతలుగా డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అలాగే రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో చివరి వరకు కొనుగోలు చేస్తామన్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు.