HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Srisailam Elevated Corridor Cm Revanth

Hyderabad-Srisailam: హైద‌రాబాద్‌- శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్‌

అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నిబంధ‌న‌ల ఫ‌లితంగా ఆ మేర‌కు ర‌హ‌దారి అభివృద్ధికి ఆటంకంగా ఉంద‌ని, కేవ‌లం ప‌గటి వేళ‌లో మాత్ర‌మే రాక‌పోక‌లు సాగించాల్సి వ‌స్తోంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల‌ని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

  • Author : Gopi Date : 12-12-2024 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad-Srisailam
Hyderabad-Srisailam

Hyderabad-Srisailam: తెలంగాణ రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మావేశ‌మయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగాన్ని 161ఏఏ జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌ని సీఎం గుర్తు చేశారు. ఇప్ప‌టికే ఈ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించింద‌ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. ద‌క్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీ‌శైలంను హైదరాబాద్ (Hyderabad-Srisailam) తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీట‌ర్ల దూరం జాతీయ ర‌హ‌దారుల ప్ర‌మాణాలతో ఉంద‌ని, మిగిలిన 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో ఉంద‌ని తెలిపారు.

అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నిబంధ‌న‌ల ఫ‌లితంగా ఆ మేర‌కు ర‌హ‌దారి అభివృద్ధికి ఆటంకంగా ఉంద‌ని, కేవ‌లం ప‌గటి వేళ‌లో మాత్ర‌మే రాక‌పోక‌లు సాగించాల్సి వ‌స్తోంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల‌ని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైద‌రాబాద్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా మ‌ధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ముఖ్య న‌గ‌రాలైన‌ హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించే ప‌నుల డీపీఆర్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని కోరారు.

Also Read: Hydraa : మూసి నది కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదు – హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఈ ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నుల పూర్త‌యితే ప్ర‌మాదాల‌కు అడ్డుక‌ట్ట వేసి ప్ర‌యాణికుల ప్రాణాలు కాపాడిన వార‌మ‌వుతామ‌ని చెప్పారు. తెలంగాణ‌లోని రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్‌-63 (16) వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ న‌గ‌రాల మ‌ధ్య‌గా వెళుతోంద‌ని.. ఈ ర‌హ‌దారిని న‌గ‌రం వెలుప‌ల నుంచి నాలుగు చోట్ల క‌లుపుతూ బైపాస్ మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాల‌ని, న‌ల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని క‌లిసిన వారిలో రాష్ట్ర రహ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఎంపీలు చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్‌, మ‌ల్లు ర‌వి, క‌డియం కావ్య‌, ఎం. అనిల్ కుమార్ యాద‌వ్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • CM Revanth Reddy
  • hyderabad
  • hyderabad srisailam
  • srisailam
  • telangana
  • telugu news

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

  • Actress Shweta Menon resigns as 'AMMA' President.

    Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • IMD Alert

    Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

Latest News

  • Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

  • Tirumala School: తిరుమల స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. అసలు నిజం ఇదే..

  • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

  • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd