HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad As A Modern Technology Hub Minister Sridhar Babu

Hyderabad: ఆధునిక టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్యం ఉన్న మానవ వనరులను పరిశ్రమకు అందిస్తుందని ఆయన వెల్లడించారు.

  • Author : Gopi Date : 05-01-2025 - 4:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

Hyderabad: తెలంగాణ ప్ర‌భుత్వం రాజ‌ధాని హైద‌రాబాద్‌ను (Hyderabad) మ‌రింత అభివృద్ధి చేసే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ కంపెనీల‌తో స‌మావేశ‌మై హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టే విధంగా సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. అయితే తాజాగా ఏఐ, ఆధునిక సాంకేతికత‌లో ప్రపంచ దేశాలు దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతిక‌త‌లో గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ విస్తరిస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతిభావంతులైన మానవ వనరులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందున కొత్త సంస్థలు సిటీ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు. ఆదివారం నాడు కృత్రిమ మేధ ఆధారిత సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా డెలివరీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘డేటా ఎకానమీ’ నూతన వర్క్ స్టేషన్ ను ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్విన్స్, డేటా బదిలీ రంగాల్లో ఈ సంస్థ గణనీయ పురోగతిని సాధించడం సంతోషంగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు.

Also Read: Aditya Palicha: కొవిడ్‌లో యాప్ ప్రారంభం.. ఇప్పుడు బిలియ‌నీర్‌, ఎవ‌రీ ఆదిత్య పాలిచా?

ప్రభుత్వ పరంగా సంస్థ విస్తరణకు తమ వంతు సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్యం ఉన్న మానవ వనరులను పరిశ్రమకు అందిస్తుందని ఆయన వెల్లడించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్ వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలు, డేటా సెంటర్లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నందున యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. తాము నెలకొల్పే ఏఐ సిటీ అభివృద్ధిలో ‘డేటా ఎకానమీ’ భాగస్వామి కావాలని ఆయన కోరారు. వచ్చే ఏడాది చివరి నాటికి హైదరాబాద్ కేంద్రంలో మరో 500 మంది కొత్త ఉద్యోగులను నియమిస్తామని ‘డేటా ఎకానమీ’ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి కోపురి, జవహర్, రోషన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI Technology
  • CM Revanth Reddy
  • congress
  • Data Economy
  • hyderabad
  • Minister Sridhar Babu
  • telangana
  • telugu news

Related News

Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

వర్షాకాలం రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. సంబంధిత శాఖల అధికారులతో తాజాగా కీలక సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో చర్చించారు. వర్షాలు రాకముందే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. వానలు పడినప్పుడు సరిగ్గా పనిచేయాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గతంలోనే సమీక్ష నిర్వహించి.. వర్షాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణప

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • The chicken curry that took the life of the father

    Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

Latest News

  • Anger Management: మీకు కోపం ఎక్కువ? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!

  • Bapatla: సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

  • Alcohol: మద్యం సేవించినప్పుడు ఎక్కువగా చెమట ఎందుకు పడుతుందో తెలుసా…?

  • Trisha: హిట్‌తో భారీ రెమ్యునరేషన్.. నిర్మాతలుకు త్రిష షాక్

  • కుదిరిన అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. కుప్పకూలిన చమురు ధరలు

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd