HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rains For Three Days In Telangana

Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల

  • Author : Vamsi Chowdary Korata Date : 04-07-2026 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Rain Alert, telangana heavy rain alert, Rain Alert Today, Rain Alert Telangana, rain alert, IMD Rain Alert, Hyderabad Rain Alert, Heavy Rain Alert, weather report, Telangana Weather Report,  IMD weather report, 
Telangana Rain Alert, telangana heavy rain alert, Rain Alert Today, Rain Alert Telangana, rain alert, IMD Rain Alert, Hyderabad Rain Alert, Heavy Rain Alert, weather report, Telangana Weather Report,  IMD weather report, 

తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రానున్న రోజుల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రానున్న కొన్ని గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. జీహెచ్‌ఎంసీతో పాటు జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

అల్పపీడన ప్రభావంతో తక్షణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ఒడిదొడుకుల మధ్యే సాగనుందని తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం సంచాలకురాలు ఎస్.స్టెల్లా తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో ఇది మధ్యస్థంగా మారి, సెప్టెంబరు నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందన్నారు. దీని ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు.

గత ఏడాది జూన్ నెలలో తెలంగాణలో సాధారణం కంటే 25 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది జూన్ ముగిసే సమయానికి 15 శాతం లోటు నమోదైందని చెప్పారు. అయితే ఈ లోటు అన్ని జిల్లాల్లో ఒకేలా లేదని అన్నారు. మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షాలు కురిశాయన్నారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఏకంగా 60 నుంచి 70 శాతం వరకు వర్షపాత లోటు ఉండడం గమనార్హమన్నారు. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు పూడుస్తాయని చెప్పారు. మొత్తంగా చూసినట్లయితే ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉంటాయని, ఈ మేరకు రైతులు సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain Alert
  • Hyderabad Rain Alert
  • IMD Rain Alert
  • IMD weather report
  • rain alert
  • Rain Alert Telangana
  • Rain Alert Today
  • telangana heavy rain alert
  • Telangana Rain Alert
  • Telangana Weather Report
  • weather report

Related News

Heavy rains in these districts of AP

Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వే

  • Heavy rain warning for these districts in Telangana!

    Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

  • Heavy rains in these districts of AP

    Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

  • Widespread heavy rains across Telangana districts.

    Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

Latest News

  • Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

  • Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

  • TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

  • Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd