Rain Alert
-
#India
Heavy rains: వర్షం ఎఫెక్ట్.. రోడ్లు నదులుగా మారాయి
గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా, వరద నీటితో నిండిన రోడ్లపై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. భారత వాతావరణ […]
Date : 09-07-2026 - 12:44 IST -
#Telangana
Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని అన్నారు. నేటి నుంచి జూలై 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా వానలు, ఈదురుగాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా […]
Date : 07-07-2026 - 10:19 IST -
#Andhra Pradesh
Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన ఆరు గంటలలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం.. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటినట్లు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయుగుండం రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న […]
Date : 06-07-2026 - 9:54 IST -
#Telangana
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారడంతో తెలంగాణ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఈ వాయుగుండం ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, చాంద్‌బలి, దిఘాలకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం, చురుగ్గా కదులుతున్న రుతుపవనాల కారణంగా తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా, […]
Date : 06-07-2026 - 9:18 IST -
#Telangana
Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల
తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రానున్న రోజుల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ […]
Date : 04-07-2026 - 10:16 IST -
#Andhra Pradesh
Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు. […]
Date : 03-07-2026 - 10:15 IST -
#Telangana
Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జులై 3 నుండి జులై 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఉమ్మడిగా వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశాయి. రాబోయే 7 రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు […]
Date : 03-07-2026 - 9:55 IST -
#Telangana
Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. జూన్ నెలలో కాస్త మందగించినట్లు కనిపించిన రుతుపవన గమనం ప్రస్తుతం వేగం పుంజుకుంది. రాబోయే 24 గంటల నుంచి 72 గంటల వ్యవధిలో తెలంగాణతో పాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ముందస్తు అలర్ట్‌లు జారీ చేసింది. ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్పపీడన […]
Date : 01-07-2026 - 1:05 IST -
#Telangana
Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి.. ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ […]
Date : 29-06-2026 - 8:51 IST -
#Andhra Pradesh
Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. శనివారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని […]
Date : 27-06-2026 - 10:10 IST -
#Andhra Pradesh
Rain Alert: బంగాళాఖాతం భారీ మార్పులు.. రానున్న రోజుల్లో పిడుగుల వర్షం
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండి […]
Date : 26-06-2026 - 9:55 IST -
#Telangana
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గత కొన్ని వారాలుగా భానుడి భగభగలతో, తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిపోయిన జనం.. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం వరకు ఎండలు దంచుతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడ్డారు. అయితే, వాతావరణంలో అకస్మాత్తుగా సంభవించిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా […]
Date : 25-06-2026 - 9:38 IST -
#Andhra Pradesh
AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలతో పాటుగా ఎండలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయంటున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో […]
Date : 25-06-2026 - 8:57 IST -
#Telangana
Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన
ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా మందకొడిగా మారిన నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం తెలంగాణ పరిధిలో ఇవి కొంత ముందుకు కదిలాయని.. రానున్న 24 గంటల్లో రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఈనెల 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా […]
Date : 23-06-2026 - 10:10 IST -
#Andhra Pradesh
Rain Alert: ఏపీ భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే […]
Date : 22-06-2026 - 10:00 IST