HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Farmers 26 Godowns Constructed With Rs 295 Crore

Telangana Government : రైతులకు శుభవార్త.. రూ.295 కోట్లతో 26 గోదాముల నిర్మాణం!

  • By Vamsi Chowdary Korata Published Date - 11:47 AM, Sat - 15 November 25
  • daily-hunt
Telangana
Telangana

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈక్రమంలో ధాన్యం నిల్వ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది. ఈ హైటెక్ గోదాములను సరకుల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో నిర్మించబోతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ధాన్యం తడిసిపోవడం, తేమ పెరగడం వంటి సమస్యలు తీరతాయి అంటున్నారు. ఆ వివరాలు..

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. గడిచిన రెండు, మూడు సంవత్సరాల్లోనే.. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 3 రెట్లు పెరిగింది. ఒక్క 2024-25 సంవత్సరంలోనే రాష్ట్రంలో 190 లక్షల టన్నుల ధాన్యం, 30 లక్షల టన్నుల మక్కలు, 28 లక్షల టన్నుల పత్తితో పాటు.. 20 లక్షల టన్నుల ఇతర పంటల దిగుబడి వచ్చింది. పంటలు ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి అయినా రైతులకు పెద్దగా లాభం కలగడం లేదు. అందుకు కారణం.. ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి అయిన పంటను కాపుడుకునేందుకు.. నిల్వ చేసుకునేందుకు రాష్ట్రంలో సరిపడా గోదాములు లేవు.

దీనివల్ల పంట ఉత్పత్తి పెరిగినా సరే.. ప్రతి సంవత్సరం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సరిగా పంట చేతికొచ్చి సమయానికి అకాల వర్షాలు కురిసి పంట తడిసిపోవడం, తేమ పెరగడం మాత్రమే కాక.. ఎలుకలు, పురుగులతో తీవ్రంగా నష్టాలు జరుగుతున్నాయి. దీని వల్ల రైతులకు మాత్రమే కాక ప్రభుత్వానికి కూడా భారీ స్థాయిలో నష్టం కలుగుతుంది. ఈక్రమంలో ఈ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం.. రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 253 గోదాములున్నాయి. వీటి సామర్థ్యం 24.59 లక్షల టన్నులు. అయితే ఇవన్నీ సంప్రదాయ నమూనాలో నిర్మించడంలో.. నిల్వ సమయంలో అనేక సమస్యలున్నాయి. పోనీ వీటిల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించాలన్నా వీలవ్వడం లేదు. అందుకే ప్రభుత్వం నూతనంగా అధునాతన గోదాములు నిర్మించాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో.. 2.91 లక్షల టన్నుల సామర్థ్యంతో హైటెక్ గోదాములను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కొత్త గోదాములు సరకుల భద్రతకు, రవాణాకు అనుకూలంగా ఉండబోతున్నాయి అంటున్నారు. వీటిల్లో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబోతుండగా.. మిగిలిన వాటిని.. నాబార్డు నిధులతో నిర్మంచబోతున్నారు.

మొత్తం 26 గోదాముల నిర్మాణంలో.. 12 గోడౌన్లను రూ.155.68 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నారు. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. వీటిని నల్లగొండ జిల్లా దేవరకొండ, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మెదక్‌ జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా తాడ్వాయి, మంచిర్యాల జిల్లా మోదెల, హనుమకొండ జిల్లా వంగర, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, కరీంనగర్‌ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లి, వికారాబాద్‌ జిల్లా దుద్యాలలో వీటిని నిర్మించబోతున్నారు.

మిగిలిన 14 గోదాములను రూ.140 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించబోతున్నారు. వీటి నిల్వ సామర్థ్యం 1.40 టన్నులు. జనగామ జిల్లా రామచంద్రగూడెం, సంగారెడ్డి జిల్లా బాచుపల్లి, జగిత్యాల జిల్లాలోని చెప్యాల, మల్యాల, మెదక్‌ జిల్లా ఝరాసంగం, మహబూబాబాద్‌ జిల్లా తోడేళ్లగూడెం, కొత్తగూడ, కామారెడ్డి జిల్లా జుక్కల్, మహ్మద్‌నగర్, మాల్‌తుమ్మెద, ఖమ్మం జిల్లా కమలాపూర్, వెంకటాయపాలెం, పెద్దపల్లి జిల్లా ధరియాపూర్, నాగర్‌కర్నూల్‌ జిల్లా పులిజాలలో వీటిని నిర్మించబోతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'Telangana Raising 2047'
  • 26 High Tech Godowns
  • Chief Minister Revanth Reddy
  • farmers
  • Godowns
  • telangana government

Related News

    Latest News

    • HILT Policy : హిల్ట్ పాలసీపై విమర్శలు.. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం

    • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    • India-Russia : భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

    • Akhanda 2 Postponed : అఖండ-2 వాయిదా..నిర్మాతల పై బాలయ్య తీవ్ర ఆగ్రహం?

    • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

    Trending News

      • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

      • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

      • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

      • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

      • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd