HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >First Danger Warning Issued At Prakasam Barrage

Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఇటీవల మూడు రోజుల కిందట వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసిన అధికారులు, వరద తగ్గుముఖం పడటంతో ఆ హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ బుధవారం నుంచి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది.

  • Author : Latha Suma Date : 28-08-2025 - 1:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
First danger warning issued at Prakasam Barrage
First danger warning issued at Prakasam Barrage

Prakasam Barrage : రాష్ట్రవ్యాప్తంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి మళ్లీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మరోసారి భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం నమోదవుతోంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఇటీవల మూడు రోజుల కిందట వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసిన అధికారులు, వరద తగ్గుముఖం పడటంతో ఆ హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ బుధవారం నుంచి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. దీంతో తాజాగా మళ్లీ అప్రమత్తత ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Read Also: Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ

ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఎగువ ప్రాంతాల నుంచి 3.03 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మొత్తం 69 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 2.97 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో (ప్రవాహం ప్రవేశం), ఔట్‌ఫ్లో (నీటి విడుదల) రెండూ సుమారు 4.05 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సూచించింది. నదీ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాల్లోకి వెళ్ళొద్దని, వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేసింది.

మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ..ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక అధికారికంగా జారీ చేసే అవకాశం ఉంది. లంక గ్రామాలు, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో ప్రజలు ముందస్తుగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి నిమజ్జనాల్లో ఎలాంటి అజాగ్రత్తలు తీసుకోకూడదు అని తెలిపారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో వరద నీరు ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు సకాలంలో సమాచారం చేరవేస్తూ, అవసరమైన చోట్ల సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో గట్టి పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నందున, వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ముందస్తు చర్యలకు పాల్పడుతోంది.

Read Also: AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • APSDMA
  • First hazard warning
  • heavy rains
  • Krishna river
  • Prakasam Barrage

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Landslides triggered by heavy rains in Wayanad...

    Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • Rains inundating Mumbai

    Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd