HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Eight Years Boy Dies In Warangal

Warangal : చాక్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఎనిమిదేళ్ల బాలుడు మృతి

చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ పట్టణంలోని పిన్నవారి వీధిలో..

  • Author : Prasad Date : 27-11-2022 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suicide
Deadbody Imresizer

చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ పట్టణంలోని పిన్నవారి వీధిలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన కంగహన్ ​​సింగ్ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వ‌చ్చి జేపీఎన్ రోడ్‌లో ఎలక్ట్రికల్ దుకాణాన్ని నడుపుతున్నాడు. అతని భార్య గీత, ముగ్గురు కుమారులు ఒక కుమార్తెతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లైన్‌లో నివసిస్తున్నాడు. కంగహన్ ​​సింగ్ ఇటీవల వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుంచి పిల్లలకు చాక్లెట్లు తీసుకొచ్చాడు. కంగహన్ ​​రెండవ కుమారుడు, సందీప్(8) పిన్నవారి వీధిలోని శారద పబ్లిక్ స్కూల్‌లో రెండ‌వ తరగతి చదువుతున్నాడు. పాఠ‌శాల‌కు వెళ్లే ముందు కంగహన్ సింగ్ భార్య‌ పిల్లలకు చాక్లెట్లు ఇచ్చింది. నోటిలో చాక్లెట్ పెట్టుకుని స్కూల్ మొదటి అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లిన సందీప్ కొద్దిసేపటి తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో కంగహన్ ​​సింగ్ వెంటనే వచ్చి బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయిందని, చికిత్స పొందుతూ ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • boy dies
  • chocolate
  • telangana
  • warangal

Related News

Son Writes Exam Hours After Father's Death

గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదు

  • Telugu States IRCTC Special Trains

    తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Minister Uttam Holds High L

    Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Telangana Agriculture

    ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

  • Travels Bus Overturns In Ni

    Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd