HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cpi Fully Supports Congress Candidate In Jubilee Hills By Election

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Author : Gopi Date : 17-10-2025 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jubilee Hills
Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి సిపిఐ మద్దతు కోరుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్ శుక్ర‌వారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మాగ్దూం భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె. నారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఈటి నరసింహ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, కలవేణ శంకర్‌, ఎం. బాలనరసింహ, బాగం హేమంతరావు, వి.ఎస్‌.బోస్‌, సీపీఐ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యంలతో స‌మావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు సీపీఐ అందిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్‌- సీపీఐ కీల‌క చ‌ర్చ‌

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు.

Also Read: Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

ముఖ్యంగా చర్చించిన అంశాలు

రాష్ట్రంలో బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా మరింత ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ విషయంలో భవిష్యత్ కార్యాచరణ, పోరాట వ్యూహాలపై చర్చ జరిగింది. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి పనిచేయడం, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి నేతలు చర్చించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • cpi
  • hyderabad
  • jubilee hills
  • telangana
  • telugu news

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • One Lakh New Pensions In Te

    New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd