HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Janagarjana Meeting In Khammam

Congress Janagarjana : జ‌న‌సంద్రంగా మారిన ఖ‌మ్మం.. జ‌న‌గ‌ర్జ‌న‌కు త‌ర‌లివ‌స్తున్న జ‌నం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) త‌న ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖారావాన్ని పూరించ‌నుంది. ఖ‌మ్మం జ‌న‌గ‌ర్జ‌న వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది.

  • Author : Prasad Date : 02-07-2023 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

Congress Janagarjana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ త‌న ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖారావాన్ని పూరించ‌నుంది. ఖ‌మ్మం జ‌న‌గ‌ర్జ‌న వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖ‌మ్మం న‌గ‌రం వైపే ప‌రుగులు తీస్తున్నాయి. భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ముగింపు స‌భ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక కావ‌డంతో పెద్ద సంఖ్య‌లో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు త‌రలివ‌స్తున్నారు. ఖ‌మ్మం జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు ల‌క్ష‌ల‌ మందితో జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌నే ల‌క్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.

భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 1360 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. భ‌ట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భ‌ట్టి విక్ర‌మార్క భరత వాక్యం పలికాడని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే బ‌లంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్ర‌మార్క తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడు.

ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్న జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం ఖ‌మ్మం న‌గ‌రం అందంగా ముస్తాబైంది. ఖ‌మ్మం న‌గ‌రంలో అడుగ‌డుగునా మూడు రంగుల జండాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుంద‌రంగా మారింది. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ ల‌తో అలంకరించారు. ప‌ట్ట‌ణంలో ప్ర‌ధాన ర‌హదారులు, చౌర‌స్తాలు, కూడ‌ళ్లు, విద్యుత్ స్థంభాల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీల‌తో అత్యంత సుంద‌రంగా అలంక‌రించారు. ప‌ట్ట‌ణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20×20 అడుగుల స‌ర్కిల్ హోర్డింగ్ లు, భారీ క‌టౌట్ లు, పెద్ద‌పెద్ద బెలూన్స్ ఎగ‌రేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.

Also Read:  Congress Jana Garjana: వాహనాలను అడ్డుకోవడంతో పాదయాత్ర చేస్తూ ‘జన గర్జన’కు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CLP leader Bhatti Vikramarka
  • congress
  • janagarjana
  • khammam
  • rahul gandhi
  • telangana
  • tpcc

Related News

CM Revanth Reddy's meeting cancelled.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధిర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగ

    Latest News

    • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

    • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

    • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd