HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Govt In Telangana Borrowed Rs 50000 Crore In Eight Months Ktr

KTR: ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు, పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణ మార్కును దాటారన్నారు.

  • Author : Praveen Aluthuru Date : 14-08-2024 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Revanth
Ktr Revanth

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల్లోనే రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం ఒక్క కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ను అమలు చేయకుండానే 50 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు కేటీఆర్.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణ మార్కును దాటారన్నారు. అది కూడా ఒక్క కొత్త ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లేకుండా అని దుయ్యబట్టారు. రాబోయే సంవత్సరాలలో అదనంగా 4-5 లక్షల కోట్ల అప్పులు చేయనుందని విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాలన పూర్తిగా కుప్పకూలిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచ్‌లు గత ఎనిమిది నెలలుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారని కేటీఆర్ ఆరోపించారు.

పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో గ్రామాల్లో ప్రజల జీవనం దినదినగండంగా మారింది. పంచాయతీల్లో దోమల మందులకు సైతం నిధులు లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని ఆరోపించారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇదేనా మీ ప్రజల పాలన అని ప్రశ్నించారు కేటీఆర్.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలకు ప్రతినెలా రూ.275 కోట్లను సత్వరమే విడుదల చేసిందని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు అడిగినందుకు 1800 మంది మాజీ సర్పంచ్‌లను కాంగ్రెస్ హయాంలో అక్రమంగా అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు.15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన రూ.500 కోట్లను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పాలని కేటీఆర్ అన్నారు. ఉపాధి హామీ పథకం, ఆరోగ్య మిషన్‌కు వచ్చిన రూ.2,100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని ప్రశ్నించారు.

Also Read: China : టెస్లాను దాటేసిన చైనా కంపెనీ.. పదిన్నర నిమిషాల్లోనే ఛార్జింగ్‌ అయ్యే ఈవీ బ్యాటరీ రెడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 50000 crore
  • 8 months
  • brs
  • CM Revanth Reddy
  • congress
  • debt
  • ktr
  • telangana
  • Towns
  • Villages

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Latest News

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

  • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd