China : టెస్లాను దాటేసిన చైనా కంపెనీ.. పదిన్నర నిమిషాల్లోనే ఛార్జింగ్ అయ్యే ఈవీ బ్యాటరీ రెడీ
ప్రపంచంలోనే అత్యంత వేగంగా రీఛార్జి అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) బ్యాటరీని చైనా డెవలప్ చేసింది.
- By Pasha Published Date - 01:02 PM, Wed - 14 August 24

China : ప్రపంచంలోనే అత్యంత వేగంగా రీఛార్జి అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) బ్యాటరీని చైనా డెవలప్ చేసింది. చైనాకు చెందిన జీకర్ సంస్థ దీన్ని తయారు చేసింది. టెస్లా కంపెనీ ఈవీ బ్యాటరీల కంటే తాము తయారు చేసిన బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అవుతుందని జీకర్ సంస్థ వెల్లడించింది. తమ కంపెనీ తయారుచేసిన ఈవీ బ్యాటరీలు 10 శాతం నుంచి 80 శాతం మేర ఛార్జింగ్ కావడానికి పదిన్నర నిమిషాల టైమే తీసుకుంటాయని తెలిపింది. మైనస్ 10 డిగ్రీల టెంపరేచర్‌లో కూడా తమ బ్యాటరీలు బాగా పనిచేస్తాయని పేర్కొంది. టెస్లా కంపెనీకి చెందిన మోడల్ 3లో వాడే బ్యాటరీలను ఛార్జింగ్ చేయడానికి 15 నిమిషాలు పడుతుందని జీకర్ సంస్థ గుర్తుచేసింది. జీకర్ సంస్థ తయారు చేసిన ఈవీ బ్యాటరీతో ‘2025 జీకర్ 007’ సెడాన్ కారు వచ్చేవారం మార్కెట్లోకి విడుదల కానుంది.
We’re now on WhatsApp. Click to Join
చైనా(China) కార్ల తయారీ దిగ్గజం గీలీకి చెందిన సంస్థే ‘ జీకర్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ హోల్డింగ్ లిమిటెడ్’. బ్రిటన్‌లో కార్యకలాపాలు సాగించే లోటస్, స్వీడన్‌కు చెందిన వోల్వో కంపెనీ కూడా ఈ గ్రూపులోని సంస్థలే. ప్రస్తుతం జీకర్‌కు చైనాలో దాదాపు 500 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2026 నాటికి వీటి సంఖ్యను 10,000 స్టేషన్లకు పెంచాలని జీకర్ కంపెనీ భావిస్తోంది.
Also Read :Mineral Rich States : ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలో చైనా దూకుడు
స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలో చైనా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్లతో దుమ్మురేపే సేల్స్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చైనా కంపెనీలు వివో, షావోమీ తొలి 2 స్థానాల్లో నిలిచాయి. అవి భారీగా సేల్స్ సాధించాయి. ఇక మూడో స్థానంలో కొరియా కంపెనీ శామ్‌సంగ్, ఆరో స్థానంలో అమెరికా కంపెనీ యాపిల్ నిలిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ భారత్‌లోనూ చైనా స్మార్ట్‌ఫోన్లు ముందుకు సాగుతున్నాయి. వాటిని భారతీయులు ఎంతో ఆదరిస్తున్నారు.