HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy To Inaugurate Bathukamma Kunta In Ellundi

Bathukamma Kunta: ఎల్లుండి బతుక‌మ్మ కుంటను ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి!

ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు పాల్గొంటారని సీఎస్‌ తెలిపారు.

  • By Gopichand Published Date - 06:02 PM, Wed - 24 September 25
  • daily-hunt
Bathukamma Kunta
Bathukamma Kunta

Bathukamma Kunta: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బతుకమ్మ కార్యక్రమంతో పాటు 26న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న బతుకమ్మ కుంట (Bathukamma Kunta) కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం

అంబర్ పేట్‌లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26న ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో హాజరు కానున్నందున, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులను సీఎస్‌ ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుండే మహిళలు చేరుకునే అవకాశం ఉన్నందున శానిటేషన్, బందోబస్తు, తాగునీటి సదుపాయం వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Also Read: Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం బతుకమ్మ ఉత్సవం

ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు పాల్గొంటారని సీఎస్‌ తెలిపారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, స్టేజి ఏర్పాట్లు, విద్యుదీకరణ, శానిటేషన్ వంటి ఏర్పాట్లు చేయాలని రామకృష్ణా రావు స్పష్టం చేశారు.

Also Read: Smartphones: పాత స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

ఇతర కార్యక్రమాలు

టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. 27న ట్యాంక్ బండ్ పై సాయంత్రం బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్స్ ప్లాజా, 30న ట్యాంక్ బండ్ పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathukamma
  • Bathukamma Kunta
  • CM Revanth Reddy
  • hyderabad
  • telangana
  • telugu news

Related News

Og Tgh

OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

OG : తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" (OG) సినిమా విడుదలకు ముందే పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వెంటనే స్పందించి ఆ జీవోను సస్పెండ్ చేసింది.

  • Iti Collage

    ITI College : తెలంగాణ లో కొత్తగా మరో 4 ఐటీఐ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఎక్కడెక్కడంటే !!

  • CM Revanth

    CM Revanth: మేడారం అభివృద్ధి మనందరి భాగ్యం, 18 సార్లు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నాను: సీఎం రేవంత్

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

  • Minister Nara Lokesh

    Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!

Latest News

  • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

  • Celebrities: 40 ఏళ్ల వ‌య‌సులో గర్భం దాల్చిన సెలబ్రిటీలు వీరే!

  • CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

  • Sania Mirza: మాతృత్వంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • Deepika Padukone: హాలీవుడ్ సినిమా కోసం ప్ర‌భాస్ మూవీని వ‌దులుకున్న దీపికా ప‌దుకొణె?!

Trending News

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

    • Sonu Sood: సోనూసూద్ ఈడీ విచారణకు హాజరు – బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో కదలిక

    • Cycling vs Walking: వాకింగ్ vs సైక్లింగ్ – ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల అభిప్రాయం

    • GST Reforms: జీఎస్టీ 2.0.. మొద‌టిరోజు అమ్మ‌కాలు ఏ రేంజ్‌లో జ‌రిగాయంటే?

    • Cash: ఇంట్లో ఎంత న‌గ‌దు ఉంచుకుంటే మంచిది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd