CM Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం వాయిదా.. కారణమిదే..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు.
- By Gopichand Published Date - 11:12 AM, Thu - 21 December 23

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ఇటు ప్రభుత్వ విధులు.. అటు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పని నిమిత్తం ఢిల్లీ, హైదరాబాద్ లకు తరచూ ప్రయాణం చేస్తున్నారు. బుధవారం ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సీఎం గురువారం మళ్లీ ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంత బిజీ షెడ్యూల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశం వాయిదా పడింది. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్షలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీఎం భావించారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై జిల్లా పాలనాధికారులు అందరూ తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. వారంతా ఆ మేరకు సిద్ధమయ్యారు.
Also Read: China Earthquake: భూకంపం గురించి చైనాకు ముందే తెలుసా..? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సమావేశం వాయిదా పడినట్లు కలెక్టర్లకు సమాచారం అందింది. ఓవైపు శాసనసభ సమావేశాలు ఉండటం, మరోవైపు నేడు ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానుండడం వల్ల కలెక్టర్ల సమీక్షా సమావేశానికి రేవంత్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. దింతో కలెక్టర్లతో సమావేశం వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.