CM Revanth Reddy : గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పానని గుర్తుచేశారు. తన మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే తాము ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు.
- By Latha Suma Published Date - 06:38 PM, Sun - 6 October 24

koluvula festival : హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈరోజు కొలువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…గత బీఆర్‌ఎస్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని, తాము మాత్రం ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని అన్నారు. వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం.. ఉద్యోగాలు ఇవ్వడాన్ని బాధ్యతగా భావించలేదని అన్నారు. ఉద్యోగాల కోసం నిరీక్షించి, నిరీక్షించి గత ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
Read Also: Champai Soren : జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌కు అస్వస్థత
నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పానని గుర్తుచేశారు. తన మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే తాము ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు. దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతి కుటుంబంలో ఆనందం చూడాలని ఇవాళ మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 1,635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని ఇది భావోద్వేగమని, ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
Read Also: Telugu Desam Party: టీడీపీలో చీలిక.. బయటపడిన విభేదాలు!
తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని, విద్యార్థి, నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారని అన్నారు. ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని తెలిపారు. కొలువులు పొందుతున్న వారు దానిని ఉద్యోగంగా కాకుండా.. ఉద్వేగంగా భావించాలని సూచించారు. ఇంజనీర్లుగా నియమితులు అవుతున్న మీరు.. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్ ను కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారా..? కాళేశ్వరంను కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కమీషన్ల కోసం హడావిడిగా కట్టారని, కానీ అది ఐదేళ్లు కూడా మిగలలేదని తెలిపారు. వందేళ్ల అభివృద్దిని పదేళ్ళలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందన్నారు.