HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Split In Ap Telugu Desam Party Open Differences

Telugu Desam Party: టీడీపీలో చీలిక‌.. బ‌య‌ట‌ప‌డిన విభేదాలు!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి.

  • Author : Gopi Date : 06-10-2024 - 6:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu Desam Party
Telugu Desam Party

Telugu Desam Party: ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి 164 స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసందే. ఇదే ఎన్నిక‌ల్లో వైసీపీ కేవ‌లం 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన 100 రోజుల్లోనే కూట‌మిలో కీల‌క పార్టీ అయిన టీడీపీ (Telugu Desam Party)లో చీలిక మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్య‌క్తి వ‌ల‌న టీడీపీ ఓ నియోజ‌క‌వ‌ర్గంలో రెండుగా చీలిపోయిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబే స్వ‌యంగా రంగంలోకి దిగి హెచ్చ‌రించినా ఆ ఎమ్మెల్యే త‌న వైఖ‌రిని మార్చుకోవ‌టానికి ప్ర‌య‌త్నంచ‌టంలేదు. అయితే శ‌నివారం ఆ ఎమ్మెల్యేనే ఇక‌పై త‌న వైఖ‌రిని మార్చుకోనున్న‌ట్లు ఓ మాట వ‌దిలాడు. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రు..? ఏ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలో చీలిక మొద‌లైంది..? అని రాష్ట్రంలో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి. దేవదత్ నిర్వహించిన సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, వర్ల రామయ్య హాజరయ్యారు. మరో నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొలికపూడి వద్దంటూ దేవదత్‌ వర్గం తీవ్ర ఆందోళన చేస్తోంది. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేవ‌లం పార్టీ కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు స‌మాచారం.

Also Read: Champai Soren : జార్ఖండ్‌ మాజీ సీఎం చంపాయ్‌ సోరెన్‌కు అస్వస్థత

అయితే ఎమ్మెల్యే నిర్వ‌హించిన స‌మావేశంలో ఎంపీ చిన్ని, వ‌ర్ల రామ‌య్య హాజ‌రుకాక‌పోవ‌డం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు దారితీస్తోంది. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే కొలిక‌పూడి విధానం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు న‌చ్చ‌టంలేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అంతేకాకుండా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ బాధ్య‌త‌ల‌ను ఎమ్మెల్యేకు కాకుండా దేవ‌ద‌త్‌కు ఇవ్వాల‌ని మ‌రో వ‌ర్గం వాదిస్తోంది. అయితే నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా త్వ‌ర‌లోనే త‌న‌కు బాధ్య‌త‌లు వ‌స్తాయ‌ని దేవ‌ద‌త్ ఇటీవ‌ల ఓ మీడియా స‌మావేశంలో చెప్పిన విష‌యం తెలిసిందే. నిజంగానే చంద్ర‌బాబు దేవ‌ద‌త్‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ ప‌ద‌వి ఇస్తే అది ఏపీ రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారే అవ‌కాశం ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండ‌గా.. పార్టీ వేరే వ్య‌క్తికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన దాఖ‌లాలు ఏపీ రాజ‌కీయాల్లో లేవు. మ‌రీ తిరువూరు టీడీపీలో ఏం జ‌ర‌గ‌బోతుందా అని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • CM Chandrababu
  • MLA Kolikapudi Srinivasa Rao
  • NTR Dist
  • tdp mla
  • telugu desam party
  • tiruvuru
  • TTD Laddu issue
  • YCP vs TDP

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • MLA Chintamaneni Prabhakar goes on a rampage.

    TDP ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd