YouTuber Harsha Sai: హర్ష సాయిపై కేసు.. ఇతడు ఎవరు ? ఎందుకీ కేసు ?
హర్షసాయి(YouTuber Harsha Sai) లాంటి కంటెంట్ క్రియేటర్లు తమను అనుసరిస్తున్న లక్షలాది మంది నెటిజన్లను తప్పుదారి పట్టిస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు.
- By Pasha Published Date - 01:43 PM, Sun - 16 March 25

YouTuber Harsha Sai: ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదైంది. ఎంతో మంది అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ బారినపడి బికారీలుగా మారుతున్నారు. అయినా కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా హర్షసాయి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. ఈవిధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను నెటిజన్లు అన్‌ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి సోషల్ మీడియా అకౌంట్లను రిపోర్ట్ చేయాలి.
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!
ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.… pic.twitter.com/h0Vyxl2vXh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025
Also Read :Gadkari Vs Caste Politics: కుల, మత రాజకీయాలకు నేను వ్యతిరేకం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో మాత్రమే పోరాడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హర్షసాయి(YouTuber Harsha Sai) లాంటి కంటెంట్ క్రియేటర్లు తమను అనుసరిస్తున్న లక్షలాది మంది నెటిజన్లను తప్పుదారి పట్టిస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు. దయచేసి హర్షసాయి లాంటి ఇన్ ఫ్లూయెన్సర్ల మాటలను, ప్రమోషన్లను నమ్మొద్దని ఆయన కోరారు. ప్రజల జీవితాలు, వారి భవిష్యత్తు, కుటుంబ శ్రేయస్సు, సమాజ నిర్మాణం బాగుండాలంటే బెట్టింగ్ తరహా వ్యసనాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
హర్షసాయి గురించి..
- యూట్యూబర్ హర్షసాయి స్వస్థలం విశాఖపట్నం.
- 1999 మార్చి 8న జన్మించాడు.
- గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశాడు.
- 2018లో హర్ష సాయి ఫర్ యూ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు.
- ఇతడు తొలుత తనకు ఇష్టమైన సైన్స్, శరీరాకృతి, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవాడు.
- ఆ తర్వాత రూట్ మార్చి పేదవారికి సాయం చేయడం వంటివి మొదలుపెట్టాడు.
- యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే.. హర్షసాయి మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేశాడు. దీంతో ఈజీగా పాపులారిటీ లభించింది. అతడి వీడియోలు వైరల్ అయ్యాయి.
- దీంతో అనతి కాలంలోనే 70 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు.
- అత్యధిక సబ్ స్క్రయిబర్లను కలిగిన యూట్యూబర్లను చాలా కంపెనీల ప్రతినిధులు కలుస్తుంటారు. తమ ప్రోడక్ట్‌లను వీడియోల మధ్యలో ప్రమోట్ చేయమని కోరుతుంటారు. ఇదే విధంగా వచ్చిన ఒక ఆఫర్‌ను హర్షసాయి స్వీకరించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు.