HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Win In Jubilee Hills Sensational Results Of Kk Survey

KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

ఈ ఫలితాలు కనుక ఎన్నికల తుది ఫలితాలలో తేడా వస్తే కేకే సర్వేస్‌కు ఉన్న విశ్వసనీయత, పట్టు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. బీఆర్‌ఎస్ ఓట్లు పడినా కూడా ఇంత భారీ శాతం ఓట్లు రావడం సామాన్య విషయం కాదు.

  • Author : Gopi Date : 01-11-2025 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KK Survey
KK Survey

KK Survey: రాష్ట్ర రాజకీయాలలో గ‌త కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్న‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఏకపక్ష విజయం సాధించబోతోందని కేకే సర్వేస్ (KK Survey) అధినేత కేకే సంచలన ఫలితాలు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు ఏకంగా 55 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 37 శాతం ఓట్లు మాత్రమే దక్కుతాయని ఆయన తేల్చి చెప్పారు.

విశ్వసనీయతపై రిస్క్

కేకే సర్వేస్ విడుదల చేసిన ఈ ఫలితాలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకే రోజులో కాకుండా చాలా కాలం పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో క్షేత్ర స్థాయిలో ఈ సర్వే నిర్వహించినట్లు కేకే తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఇంత కచ్చితమైన శాతం ఓట్లను అంచనా వేయడం కొంచెం అసాధారణమైన విషయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో కేకే సర్వే ఫలితాలు విఫలమైన నేపథ్యంలో ఈసారి జూబ్లీహిల్స్ వంటి అత్యంత పోటీ ఉన్న నియోజకవర్గంలో ఇంత పెద్ద తేడాతో బీఆర్‌ఎస్ విజయాన్ని ప్రకటించడం ద్వారా కేకే సర్వేస్ కొంత రిస్క్ తీసుకున్నట్లేనని అనుకోవచ్చు.

Also Read: Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాల‌ని అమిత్ షాకు లేఖ!

బీజేపీ- మైనారిటీ ఓట్ల పంపిణీ

ఈ సర్వే ప్రకారం బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగం మాత్రమే వస్తాయని కేకే అంచనా వేశారు. ఇక మజ్లిస్ (ఎంఐఎం) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినప్పటికీ ముస్లిం ఓటర్లు ఆ సపోర్టును పట్టించుకోకుండా కాంగ్రెస్‌కు కాకుండా బీఆర్‌ఎస్ పార్టీకే సగానికి పైగా ఓట్లు వేస్తున్నారని కేకే సర్వేలో వెల్లడైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు 55 శాతం ఓట్లు వస్తాయని చెప్పడం అసాధారణమైన విజయంగా పరిగణించాలి.

అడ్వాంటేజ్‌లు ఉన్నా కాంగ్రెస్ వెనుకబాటు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బలం, మజ్లిస్ మద్దతు వంటి అనేక అడ్వాంటేజ్‌లు ఉన్నప్పటికీ వాటన్నిటినీ లెక్కలోకి తీసుకున్నా కూడా బీఆర్‌ఎస్‌కు 55 శాతం ఓట్లు వస్తాయని కేకే ప్రకటించడం ఒక సాహసోపేతమైన అంచనా.

ఈ ఫలితాలు కనుక ఎన్నికల తుది ఫలితాలలో తేడా వస్తే కేకే సర్వేస్‌కు ఉన్న విశ్వసనీయత, పట్టు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. బీఆర్‌ఎస్ ఓట్లు పడినా కూడా ఇంత భారీ శాతం ఓట్లు రావడం సామాన్య విషయం కాదు. ఈ సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకులలో, ఆయా పార్టీల నాయకులలో తీవ్ర చర్చకు దారితీశాయి. తుది ఫలితాలు వచ్చే వరకు ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • hyderabad
  • jubilee hills
  • Jubilee Hills By Elections
  • kk survey

Related News

Dk Shiva Kumar

Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) శనివారం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు బ‌లంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక గవర్నర్ సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించి మంత్రివర్గాన్ని రద్దు చేయడంతో అధికారికంగ

  • Tbjp Chief Ramchandar Rao

    BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Siddaramaiah

    Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd