HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Ghmc Floor Leader Has Joined The Congress Party

BRS to Congress: రేవంత్ ఇంటి వైపు గులాబీ చూపులు

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీ బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 17-10-2023 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs To Congress
Brs To Congress

BRS to Congress: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీ బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు. బీజేపీ ఇంకా ఆ దిశగా వెళ్ళలేదు. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ నుంచి రోజురోజుకి బయటకు వస్తున్నారు.

అధికార బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ ఇస్తూ జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ , ఇతర నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు .జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.జగదీశ్వర్ గౌడ్ గత కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్​కోసం ప్రయత్నాలు జరిపారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్​ ఎమ్మెల్యేకే టికెట్​ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన హస్తం గూటికి చేరారు.

కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికల పర్వం కొనసాగనుంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యాడు. అదేవిధంగా మండవ వెంకటేశ్వర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. మరో వైపు ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ సహా ఐదుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.

Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం, నిరుద్యోగురాలికి రేవంత్ రెడ్డి హామీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • floor leader
  • GHMC
  • Jagadishwar Goud
  • kcr
  • Madhapur Corporator
  • revanth reddy

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM: కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘన విజయం సాధించడంతో పదేళ్ల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గ

    Latest News

    • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

    • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

    • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

    • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    Trending News

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd