Actor Ali : ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు.. కమేడియన్ అలీకి అధికారుల నోటీసులు
వికారాబాద్ జిల్లా ఏక్ మామిడి గ్రామంలోని రెవెన్యూ సర్వే నంబరు 345లో నటుడు అలీ(Actor Ali) తండ్రి దివంగత మహ్మద్ బాషా పేరిట ఒక ఫామ్ హౌస్ ఉంది.
- By Pasha Published Date - 12:17 PM, Sun - 24 November 24

Actor Ali : ప్రముఖ నటుడు అలీకి తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం ఏక్ మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈనెల 22న నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి ఈనెల 5న కూడా ఆమె నుంచి అలీకి నోటీసులు అందాయి. అప్పట్లో ఇచ్చిన నోటీసులకు అలీ నుంచి సమాధానం రాకపోవడంతో.. మళ్లీ నవంబరు 22న నోటీసులు అందించినట్లు తెలిసింది.
Also Read :Jay Bhattacharya : అమెరికాలో మరో భారతీయుడికి కీలక పదవి.. ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య!
ఇంతకీ విషయం ఏమిటంటే.. వికారాబాద్ జిల్లా ఏక్ మామిడి గ్రామంలోని రెవెన్యూ సర్వే నంబరు 345లో నటుడు అలీ(Actor Ali) తండ్రి దివంగత మహ్మద్ బాషా పేరిట ఒక ఫామ్ హౌస్ ఉంది. గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోకుండా ఆ ఫామ్ హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి గుర్తించారు. అందుకే ఆమె ఈనెల 5న తొలిసారి నోటీసు జారీ చేశారు. దానికి అలీ స్పందించలేదు. దీంతో ఈనెల 22న నోటీస్ ఇచ్చారు. దీనికి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అలీని శోభారాణి కోరారు.
Also Read :Special Trains : స్పెషల్ ట్రైన్లు.. ఎక్స్‌ట్రా ఛార్జ్.. ఎక్స్‌ట్రా లేట్
‘‘ఏక్ మామిడి గ్రామంలోని రెవెన్యూ సర్వే నంబరు 345లో ఉన్న ఫామ్ హౌస్‌లో కొత్తగా చేపట్టిన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా ? ఆయా అనుమతులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయా ? ఒకవేళ పత్రాలు ఉంటే వాటిని గ్రామ పంచాయతీలో సమర్పించండి. ఒకవేళ అనుమతులు లేకుంటే.. తప్పకుండా అనుమతులు తీసుకోండి. లేదంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారం పూర్తిగా తేలే వరకు ఫామ్ హౌస్‌లో నిర్మాణ పనులను చేయకూడదు’’ అని నోటీసులో ప్రస్తావించారు. ఈ నోటీసుకు తన న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చేందుకు అలీ రెడీ అవుతున్నారట. కొందరు కుట్రపూరితంగా తనకు నోటీసులు వచ్చేలా చేశారని అలీ ఆరోపిస్తున్నారు.