Special Trains : స్పెషల్ ట్రైన్లు.. ఎక్స్‌ట్రా ఛార్జ్.. ఎక్స్‌ట్రా లేట్
రాకపోకల సమయాల్లో తీవ్ర జాప్యంతో పాటు మార్గం మధ్యలో క్రాసింగ్స్ కారణంగా స్పెషల్ రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకోవడంలో బాగా లేట్(Special Trains) అవుతున్నాయి.
- Author : Pasha
Date : 24-11-2024 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
Special Trains : ఏటా పండుగల సీజన్‌లు, వేసవి సెలవుల్లో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లను నడుపుతుంటుంది. స్పెషల్ ట్రైను.. అనగానే కనీసం ఏదో ఒక విషయంలో స్పెషల్‌గా ఉంటుందని భావిస్తాం. కానీ అదనపు ఛార్జీల బాదుడు విషయంలో మాత్రమే స్పెషల్ ట్రైన్లు స్పెషల్‌గా ఉంటున్నాయి. టైమింగ్స్ విషయంలో మాత్రం సాధారణ రైళ్ల కంటే చాలా చాలా లేటుగా నడుస్తున్నాయి. 100 కి.మీ దూరాన్ని సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సగటున 2 గంటల్లోనే చేరుకుంటాయి. అయితే స్పెషల్ రైళ్లు మాత్రం ఈ దూరాన్ని చేరుకునేందుకు సగటున 5 గంటలకుపైనే సమయాన్ని తీసుకుంటున్నాయి. రాకపోకల సమయాల్లో తీవ్ర జాప్యంతో పాటు మార్గం మధ్యలో క్రాసింగ్స్ కారణంగా స్పెషల్ రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకోవడంలో బాగా లేట్(Special Trains) అవుతున్నాయి.
Also Read :Air Quality Today : ఇవాళ కాలుష్యమయ నగరాల్లో నంబర్ 1 ఢిల్లీ.. హైదరాబాద్ ర్యాంకు ఇదీ
చాలావరకు పాత రైళ్లనే స్పెషల్ ట్రైన్లుగా నడుపుతున్నారు. పాతకాలపు బోగీలను వాటిలో వినియోగిస్తున్నారు. చాలా స్పెషల్ ట్రైన్లలో అపరిశుభ్ర బోగీలు, అధ్వానంగా ఉన్న టాయిలెట్లు ఉంటున్నాయి. వీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రైలు ప్రయాణికులు కోరుతున్నారు. స్పెషల్ ట్రైను పేరుతో అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో వాటిలో వసతులను కల్పించడం లేదని జనం ఆరోపిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లో రద్దీ, రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంల కొరత కారణంగా స్పెషల్ రైళ్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also Read :Daaku Maharaaj : అమెరికాలో ‘డాకు మహారాజ్’ ఈవెంట్
ఈనెల 25న విజయవాడ డివిజన్‌లో ఈ రైళ్లు రద్దు
విజయవాడ రైల్వే డివిజన్‌లోని తాడి, దువ్వాడ సెక్షన్లలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా నవంబరు 25న(సోమవారం) ఈ మార్గం మీదుగా నడిచే కొన్ని రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే 12717, 12718 రైళ్లు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం మధ్య నడిచే 17267, 17268 రైళ్లను, గుంటూరు- విశాఖపట్నం మధ్య నడిచే 17239, 17240 నంబర్ రైళ్లను, రాజమండ్రి- విశాఖపట్నం మధ్య నడిచే 07466, 07467 రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు.