Bandi Sanjay : కేసీఆర్ ను కట్టేసి ‘బలగం’ సినిమా చూపించాలి : బండి సంజయ్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి తెరకెక్కిన సినిమా బలగం. అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాగా ప్రేక్షకుల మన్నలను పొందుతుంది.
- By Hashtag U Published Date - 07:02 PM, Mon - 10 April 23

Bandi Sanjay : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి తెరకెక్కిన సినిమా బలగం. అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాగా ప్రేక్షకుల మన్నలను పొందుతుంది. అయితే నేడు సోమవారం బలగం సినిమాను వీక్షించారు తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay). హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు.బండి సంజయ్ తోపాటు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు 200 మంది, మరియు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు.
సినిమా చూసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. బలగం సినిమాలో కుటుంబ గొప్పదనం గురించి బాగా చూపించారని అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని దర్శకుడిని కొనియాడారు. కుటుంబ గొప్పతనం, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే ఎమోషన్స్ వంటివేమీ కేసీఆర్ కు తెలియవని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన బిడ్డ పెళ్లి సమయంలో జైలుకు పంపారని, తననూ తన అత్త చనిపోయిన సమయంలో జైలుకు పంపారని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబం అంటే ఏమాత్రం గౌరవం లేని కేసీఆర్ ను కట్టేసి ‘బలగం’ సినిమా చూపించాలని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు
తెలంగాణ పల్లె వాతావరణం ఆధారంగా తెరకెక్కిన బలగం సినిమా చూసి ప్రతి ఒక్కరు కంటతడిపెడుతున్నారు. విడిపోయిన ఎన్నో బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి. సినిమాలో చూపించిన విధంగా కుటుంబాల మధ్య ప్రేమలు, అనురాగాలు కరువయ్యాయి. ఎవరికి వారే అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కానీ బలగం సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలోను స్ట్రీమింగ్ అవుతుంది. తెలంగాణలోని పల్లెల్లో ఈ సినిమాను తెర మీద ప్రదర్శిస్తున్నారు. ఊర్లో వాళ్ళు సినిమా చూసి కన్నీరుపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో బంధాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు.
బలగం సినిమాలో ప్రియదర్శి, చైల్డ్ ఆర్టిస్ట్ వల్లంకిపిట్ట ఫేమ్ కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలను పోషించారు.. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ సహా ఎంతో మంది అద్భుతమైన నటనతో అలరించారు.
Also Read: Amarnath Reaction: తెలంగాణ బిడ్ దాఖలు పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్..