HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Banakacharla Project Dispute Telangana Objection

Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో

Banakacharla : బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.

  • Author : Kavya Krishna Date : 15-07-2025 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Banakacharla
Banakacharla

Banakacharla : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదం మరో మలుపు తిరిగింది. బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. సమావేశం ఎజెండాలో బనకచర్ల ప్రాజెక్టును చేర్చాలన్న ఏపీ డిమాండ్‌కు తెలంగాణ తేల్చిచెప్పింది.. అది చర్చకు రావాల్సిన అంశం కాదని.

మంగళవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. అందులో బనకచర్ల ప్రాజెక్టును చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జీఆర్ఎంబీ (గ్రేటర్ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్), సిడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్), ఈఏసీ (ఎన్‌వైరన్‌మెంటల్ అసెస్‌మెంట్ కమిటీ) లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టుపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశాయని లేఖలో పేర్కొంది.

ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఏలాంటి నిబంధిత అనుమతులు లేవని, చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అనైతికమని తెలంగాణ అభిప్రాయపడింది. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం కేంద్ర నియంత్రణ సంస్థల విశ్వసనీయతకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Butter : టిఫిన్స్, కూరల్లో బటర్ అతిగా వాడుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు

ఇక ఏపీ ఇప్పటికే రేపటి సమావేశానికి సింగిల్ ఎజెండాగా బనకచర్ల అంశాన్ని చేర్చింది. తెలంగాణ–ఏపీ మధ్య నీటి పంచాయితీ వ్యవహారంలో బనకచర్లకు పెద్దపీట వేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తనవైపు నుంచి పంపిన ఎజెండాలో పెండింగ్‌లో ఉన్న కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, ఇచ్చంపల్లి వద్ద కొత్తగా 200 టీఎంసీల వర్షజల వినియోగ ప్రాజెక్టుపై దృష్టిసారించింది.

ఇప్పటికే కేంద్రం నడుపుతున్న జలవనరుల పంచాయితీలో బుధవారం సమావేశం కీలకంగా మారింది. రెండు రాష్ట్రాల సీఎం లు వ్యక్తిగతంగా పాల్గొనబోతుండటంతో, ఈ అంశంపై రాజకీయ వేడి పెరిగింది. ప్రత్యేకంగా బనకచర్ల అంశాన్ని ఏపీ పట్టుబట్టగా, తెలంగాణ మాత్రం దానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో రేపటి సమావేశం లో చర్చ ఏవిధంగా కొనసాగనుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Marathon Runner : ఫౌజా సింగ్‌ మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Banakacharla Project
  • central government
  • CM Meeting
  • cwc
  • Godavari Link
  • GRMB
  • Krishna river
  • telangana
  • water dispute

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Ravi River

    పాక్‌కు భార‌త్ భారీ షాక్..రావి నది నుంచి నీళ్లు బంద్

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd