HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Attack On Kcrs Office Harish Rao Lashes Out At Cm Revanth Reddy

Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2026 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు.

హరీశ్ రావు మాట్లాడుతూ.. “పట్టపగలే అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు బీహార్ గ్యాంగ్‌లను తలపిస్తోంది. ప్రజాప్రతినిధుల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా, లేనట్టా?” అని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిందా? అని నిలదీశారు.

“ఒకవైపు ‘హేట్ స్పీచ్ బిల్’ పేరుతో ప్రతిపక్షాల నోరు నొక్కుతూ, మరోవైపు తమ గూండాలతో దాడులు చేయించడమేనా ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండా రాజ్యాన్ని అమలు చేస్తారా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటూ, ఇక్కడి పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

కాంగ్రెస్ అణచివేతలకు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు, బెదరదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆగకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • Chief Minister Revanth Reddy
  • congress party
  • Former Minister Harish Rao
  • gajwel
  • harish rao
  • Harish rao - Revanth
  • kcr
  • political-attack
  • telangana government
  • telangana politics

Related News

Harish Rao

Harish Rao: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పు

  • Good News for the Unemployed: Massive Job Recruitment!

    Telangana Government: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఉద్యోగాల భర్తీ!

  • Revanth Reddy

    Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

  • CM Revanth Delivers Great News to Workers in Telangana

    Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

  • Good News for the Unemployed in Telangana

    Telangana Government: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd