HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >An Economic Crisis Is Looming In The Country Rahul Gandhi

Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

  • Author : Vamsi Chowdary Korata Date : 19-05-2026 - 3:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
An economic crisis is looming in the country: Rahul Gandhi
An economic crisis is looming in the country: Rahul Gandhi

దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.

ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘‘రాబోయే ఆర్థిక సంక్షోభం అదానీ, అంబానీ, మోదీని ఏమీ చేయలేదు. వాళ్లంతా తమ ప్యాలెస్‌లలో భద్రంగా ఉంటారు. కానీ దేశ యువత, సామాన్య ప్రజలు దీనివల్ల తీవ్రంగా దెబ్బతింటారు. ఇంతకుముందెన్నడూ చూడని భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశం చూడబోతోంది. కష్టకాలం ముందుంది. మోదీ ఆర్థిక విధానాలే ఇందుకు కారణం’’ అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ ఐదు దేశాల దౌత్య పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఇటలీ చేరుకోనున్నారు. అంతకుముందే ఆయన యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాల పర్యటనలను పూర్తి చేసుకున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశం రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కోనుందని మోదీ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. బంగారం కొనొద్దని, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ తాజాగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • economic crisis
  • india
  • indian economy
  • narendra modi
  • rahul gandhi

Related News

Balochistan has 'declared independence' from Pakistan.

Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

65 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును రహదారులు, రైల్వేలు మరియు పైప్‌లైన్‌ల ద్వారా చైనాలోని జిన్‌జియాంగ్‌కు అనుసంధానిస్తుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అంతర్జాతీయంగా దీనికి గుర్తింపు లేనప్పటికీ, బీజింగ్ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) కింద ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటై

  • El Niño effect: Prices of essential commodities have risen sharply.

    Prices Hike: ఎల్​నినో ఎఫెక్ట్​.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

Latest News

  • Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • Sonam Wangchuk: ‘నోటి ద్వారా లేదా IV ద్వారా మందులు వద్దు…’: చికిత్సకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి అని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

  • KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

  • RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd