HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Exhibitors Warn We Will Screen Peddi Only If We Get A Percentage

Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Exhibitors say they will screen Peddi's movie only if they receive a percentage!
Exhibitors say they will screen Peddi's movie only if they receive a percentage!

సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో పర్సంటెంజీ విధానాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలకు కొద్దిరోజుల ముందు ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ యజమాని బాలగోవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.  వారు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పర్సంటేజీ విధానం మీద నిర్మాతల వైఖరిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని, పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పర్సంటేజీ విధానం నడుస్తుంటే ఇక్కడ మాత్రం రెంటల్ విధానం సరికాదని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎగ్జిబిటర్లు థియేటర్లు మూసుకువనే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలకు ముందు ఈ సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు మాట్లాడటం లేదని మండిపడ్డారు.

‘పెద్ది’ చిత్రం నుంచి తమకు కచ్చితంగా పర్సంటేజీ విధానం అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఓటీటీల వల్ల థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పడిపోతోందని గుర్తు చేశారు. ఒకప్పుడు థియేటర్ల ద్వారా మంచి ఆదాయం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 120 మంది ఎగ్జిబిటర్లు దీనావస్థలో ఉన్నారని వాపోయారు. చిత్ర నిర్మాతలకు థియేటర్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ ఇలా వివిధ మార్గాల్లో ఆదాయం వస్తోందని, ఎగ్జిబిటర్లకు మాత్రం లాభం లేకుండా పోయిందని అన్నారు. పైగా థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని అన్నారు. పర్సంటేజీ విధానం ఇస్తేనే తమ థియేటర్లలో సినిమాలను ఆడిస్తామని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Ram Charan
  • Movie revenue
  • Peddi Movie
  • Single screen theaters
  • Telangana exhibitors
  • Telugu Film Chamber

Related News

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd