HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >34 Dead Due To Heatstroke In Telangana

Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 4:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
34 Dead Due to Heatstroke in Telangana
34 Dead Due to Heatstroke in Telangana

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రోజురోజుకూ నిప్పుల కుంపటిగా మారుతోంది. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అత్యవసరమైతే తప్ప ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. ఇక మధ్యాహ్నం పూట ప్రజల కోసం బయట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఎండలు, వడగాలులు, వడదెబ్బ పరిస్థితులపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అలెర్ట్‌గా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సూచనలు చేశారు. పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటికి రావాలని తేల్చి చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రజలకు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో వడదెబ్బ పరిహారం రూ.50 వేలు ఉండగా దాన్ని రూ.4 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.

ఇక తెలంగాణలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండగా.. 18కి పైగా జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 18 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు.. హైదరాబాద్‌ నగరంలోనూ 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వడగాలులపై హై అలర్ట్ ప్రకటించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి.. గంట గంటకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఎండదెబ్బకు గురైతే.. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి.. అత్యవసర చికిత్స అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heatwave
  • Minister Ponguleti Srinivas Reddy
  • red alert
  • sunstroke
  • Sunstroke dies
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd