Telangana Assembly Sessions: డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
- By Praveen Aluthuru Published Date - 06:57 PM, Sat - 9 December 23

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.అయితే సభలోని 119 మంది సభ్యుల్లో 18 మంది సభ్యులు ఇవాళ ప్రమాణం చేయలేదు. వీరంతా సమావేశానికి గైర్హాజరయ్యారు.బీఆర్ఎస్ పార్టీ నుడి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి , కోట ప్రభాకర్ రెడ్డి , పద్మారావు మరియు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు .ఎంఐఎం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ కారణంగా ప్రమాణస్వీకారం చేయలేదని ప్రకటించిన బీజేపీ సభ్యుల్లో ఏలేటి మహేశ్వర్, రెడ్డి సూర్యనారాయణ, ధనపాల్ కాటేపల్లి వెంకట రమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్, రామారావు పవార్ పటేల్, రాజా సింగ్ ఉన్నారు.
Also Read: English Oath : ఇంగ్లిష్‌లో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు వీరే