World Traveler Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు.. ఏం చేశాడంటే..
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్(World Traveler Anvesh)పై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.
- Author : Pasha
Date : 04-05-2025 - 10:28 IST
Published By : Hashtagu Telugu Desk
World Traveler Anvesh: ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై అన్వేష్ మాట్లాడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవలే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ‘‘బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారు’’ అంటూ ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. అందువల్లే అన్వేష్ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Also Read :856 Snakebites Vs A Man: ఇతగాడికి 856సార్లు పాముకాట్లు.. పవర్ ఫుల్ విరుగుడు రెడీ
అభియోగాలివీ..
ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే దురుద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు అన్వేష్ యత్నిస్తున్నారనే అభియోగాలను మోపారు. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వంపై వ్యతిరేకత రేకెత్తించేలా అన్వేష్ వీడియో ఉందన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్(World Traveler Anvesh)పై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్‌లపై అన్వేష్ గళం విప్పుతున్నాడు. ఈ యాప్‌లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను చెబుతున్నాడు. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసులు కూడా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కేసులు కూడా నమోదు చేశారు.