Group-III Exam: మరికాసేపట్లో గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా అభ్యర్థులు!
గ్రూప్-3 అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- Author : Gopichand
Date : 17-11-2024 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
Group-III Exam: తెలంగాణ రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల (Group-III Exam) పోస్టుల భర్తీకి రాతపరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆది, సోమవారం ఈ రెండు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించనున్నారు.
1401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
గ్రూప్-3 అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా 1363 పోస్టులకు ఆది, సోమవారాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు మొత్తం 5 లక్షల 36 వేల 395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అరగంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Bugatti Chiron Edition: వామ్మో.. ఈ కారు ధర రూ.88 కోట్లు, ప్రత్యేకతలివే!
ఉమ్మడి జిల్లాలో గ్రూప్- 3 పరీక్షలకు సర్వం సిద్ధం
సంగారెడ్డి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల్లో 15123 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాలో 19 ఎగ్జామ్ సెంటర్లలో 5867 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సిద్దిపేట జిల్లాలో 37 పరీక్షా కేంద్రాల్లో 13408 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
టీజీపీఎస్సీ చేసిన సూచనలివే
- ఒరిజినల్ ఐడీతో పరీక్షకు వెళ్లాలి.
- ఎగ్జామ్‌కు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- ఉ.9.30 తర్వాత, మ.2.30 తర్వాత పరీక్షకు అనుమతించరు.
- అభ్యర్థులు పేపర్-1కు తీసుకొచ్చిన హాల్ టికెట్‌నే మిగతా పేపర్లకు తీసుకురావాలి.
- నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్ టికెట్, ప్రశ్న పత్రాల్ని భద్రంగా పెట్టుకోవాలి.